కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 36:28సుమారు క్రీ.పూ. 1756

    దిషాను కుమారులు: ఊజు, అరాను.

  2. ఆదికాండము 36:29సుమారు క్రీ.పూ. 1756

    వీరు హోరీయుల నాయకులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

  3. ఆదికాండము 36:30సుమారు క్రీ.పూ. 1756

    దిషోను ఏసెరు దిషాను.

  4. ఆదికాండము 36:31సుమారు క్రీ.పూ. 1756

    ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు:

  5. ఆదికాండము 36:32సుమారు క్రీ.పూ. 1756

    బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది.

  6. ఆదికాండము 36:33సుమారు క్రీ.పూ. 1869

    బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.

  7. ఆదికాండము 36:34సుమారు క్రీ.పూ. 1827

    యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.

  8. ఆదికాండము 36:35సుమారు క్రీ.పూ. 1785

    హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.

  9. ఆదికాండము 36:36సుమారు క్రీ.పూ. 1743

    హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.

  10. ఆదికాండము 36:37సుమారు క్రీ.పూ. 1701

    శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.

  11. ఆదికాండము 36:38సుమారు క్రీ.పూ. 1659

    షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.

  12. ఆదికాండము 36:39సుమారు క్రీ.పూ. 1617

    అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.

  13. ఆదికాండము 36:40సుమారు క్రీ.పూ. 1617

    వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: తిమ్నా, అల్వా, యతేతు,

  14. ఆదికాండము 36:41సుమారు క్రీ.పూ. 1617

    ఒహోలీబామా, ఏలహు, పీనోను,

  15. ఆదికాండము 36:42సుమారు క్రీ.పూ. 1617

    కనజు, తేమాను, మిబ్సారు,

  16. ఆదికాండము 36:43సుమారు క్రీ.పూ. 1617

    మగ్దీయేలు, ఈరాము.

  17. ఆదికాండము 37:1సుమారు క్రీ.పూ. 1728

    యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు.

  18. ఆదికాండము 37:2సుమారు క్రీ.పూ. 1728

    యాకోబు వంశావళి వివరాలు ఇవి. యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు.

  19. ఆదికాండము 37:3సుమారు క్రీ.పూ. 1728

    ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన అంగీని కుట్టించాడు.

  20. ఆదికాండము 37:4సుమారు క్రీ.పూ. 1728

    తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు.

  21. ఆదికాండము 37:5సుమారు క్రీ.పూ. 1728

    ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు.

  22. ఆదికాండము 37:6సుమారు క్రీ.పూ. 1728

    అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి:

  23. ఆదికాండము 37:7సుమారు క్రీ.పూ. 1728

    మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు.

  24. ఆదికాండము 37:8సుమారు క్రీ.పూ. 1728

    అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు.

  25. ఆదికాండము 37:9సుమారు క్రీ.పూ. 1728

    అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు.