కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 50:12సుమారు క్రీ.పూ. 1689

    కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు:

  2. ఆదికాండము 50:13సుమారు క్రీ.పూ. 1689

    అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు.

  3. ఆదికాండము 50:14సుమారు క్రీ.పూ. 1689

    తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు.

  4. ఆదికాండము 50:15సుమారు క్రీ.పూ. 1689

    తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు.

  5. ఆదికాండము 50:16సుమారు క్రీ.పూ. 1689

    కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు:

  6. ఆదికాండము 50:17సుమారు క్రీ.పూ. 1689

    ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.

  7. ఆదికాండము 50:18సుమారు క్రీ.పూ. 1689

    అప్పుడు తన సోదరులు అతని దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, “మేము నీ బానిసలం” అన్నారు.

  8. ఆదికాండము 50:19సుమారు క్రీ.పూ. 1689

    అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా?

  9. ఆదికాండము 50:20సుమారు క్రీ.పూ. 1689

    మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.

  10. ఆదికాండము 50:21సుమారు క్రీ.పూ. 1689

    కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను” అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు.

  11. ఆదికాండము 50:22సుమారు క్రీ.పూ. 1689

    యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు,

  12. ఆదికాండము 50:23సుమారు క్రీ.పూ. 1689

    ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.

  13. ఆదికాండము 50:24సుమారు క్రీ.పూ. 1689

    యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.

  14. ఆదికాండము 50:25సుమారు క్రీ.పూ. 1689

    యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.

  15. ఆదికాండము 50:26సుమారు క్రీ.పూ. 1689

    యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.