- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 49:20సుమారు క్రీ.పూ. 1689
“ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు.
- ఆదికాండము 49:21సుమారు క్రీ.పూ. 1689
“నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.
- ఆదికాండము 49:22సుమారు క్రీ.పూ. 1689
“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.
- ఆదికాండము 49:23సుమారు క్రీ.పూ. 1689
అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.
- ఆదికాండము 49:24సుమారు క్రీ.పూ. 1689
కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,
- ఆదికాండము 49:25సుమారు క్రీ.పూ. 1689
నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.
- ఆదికాండము 49:26సుమారు క్రీ.పూ. 1689
నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
- ఆదికాండము 49:27సుమారు క్రీ.పూ. 1689
“బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”
- ఆదికాండము 49:28సుమారు క్రీ.పూ. 1689
ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు. వారి తండ్రి ఎవరి దీవెన ప్రకారం వారిని దీవిస్తూ వారికి చెప్పింది అదే.
- ఆదికాండము 49:29సుమారు క్రీ.పూ. 1689
తర్వాత అతడు వారికి ఈ సూచనలు ఇచ్చాడు: “నేను నా జనుల దగ్గరకు చేరబోతున్నాను. మీరు నన్ను నా పూర్వికుల దగ్గర, హిత్తీయుడైన ఎఫ్రోను గుహలో, కనానులో మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో, అంటే అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న గుహలో పాతిపెట్టండి.
- ఆదికాండము 49:30సుమారు క్రీ.పూ. 1689
In the cave that is in the field of Machpelah, which is before Mamre, in the land of Canaan, which Abraham bought with the field of Ephron the Hittite for a possession of a buryingplace.
- ఆదికాండము 49:31సుమారు క్రీ.పూ. 1689
అక్కడే అబ్రాహాము అతని భార్య శారా సమాధి చేయబడ్డారు, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబ్కా సమాధి చేయబడ్డారు, అక్కడే నేను లేయాను సమాధి చేశాను.
- ఆదికాండము 49:32సుమారు క్రీ.పూ. 1689
ఆ పొలం, అందులోని గుహ హిత్తీయుల దగ్గర కొనబడ్డాయి.”
- ఆదికాండము 49:33సుమారు క్రీ.పూ. 1689
యాకోబు తన కుమారులకు సూచనలు ఇచ్చిన తర్వాత, మంచంపై తన కాళ్లు ముడుచుకుని తుది శ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరకు చేర్చబడ్డాడు.
- ఆదికాండము 50:1సుమారు క్రీ.పూ. 1689
యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు.
- ఆదికాండము 50:2సుమారు క్రీ.పూ. 1689
తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు.
- ఆదికాండము 50:3సుమారు క్రీ.పూ. 1689
కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు.
- ఆదికాండము 50:4సుమారు క్రీ.పూ. 1689
సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో,
- ఆదికాండము 50:5సుమారు క్రీ.పూ. 1689
‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు.
- ఆదికాండము 50:6సుమారు క్రీ.పూ. 1689
అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు.
- ఆదికాండము 50:7సుమారు క్రీ.పూ. 1689
కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు,
- ఆదికాండము 50:8సుమారు క్రీ.పూ. 1689
యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.
- ఆదికాండము 50:9సుమారు క్రీ.పూ. 1689
రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు.
- ఆదికాండము 50:10సుమారు క్రీ.పూ. 1689
వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు.
- ఆదికాండము 50:11సుమారు క్రీ.పూ. 1689
అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది.