Skip to content

Patriarchal Government గురించి బైబిల్ వచనాలు

75 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు.

  2. ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.”

  3. ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి.

  4. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.

  5. అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.

  6. అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు.

  7. అయితే ఒక వ్యక్తి తప్పించుకు వచ్చి, హెబ్రీయుడైన అబ్రాముకు ఈ సంగతి తెలిపాడు. అబ్రాము ఎష్కోలు ఆనేరుల సోదరుడైన మమ్రే అనే అమోరీయుని సింధూర వృక్షాలు దగ్గర నివసిస్తున్నాడు. వీరు అబ్రాముతో ఒప్పందం చేసుకున్న వారు.

  8. అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు.

  9. రాత్రివేళ అబ్రాము తన మనుష్యులను గుంపులుగా విభజించి దాడి చేస్తూ, శత్రువులను ముట్టడించి, దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని తరిమాడు.

  10. అబ్రాము తన బంధువైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ఇతర ప్రజలను విడిపించాడు.

  11. ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”

  12. మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.

  13. ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.

  14. కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”

  15. అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.

  16. అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు.

  17. అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.

  18. అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు.

  19. అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు.

  20. అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.

  21. అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.

  22. అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు.

  23. బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు.

  24. “అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు.

  25. వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము.