కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 37:35సుమారు క్రీ.పూ. 1728

    అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు.

  2. ఆదికాండము 37:36సుమారు క్రీ.పూ. 1728

    ఇంతలో మిద్యానీయులు యోసేపును, ఈజిప్టులో ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరుకు అమ్మివేశారు.

  3. ఆదికాండము 38:1సుమారు క్రీ.పూ. 1739

    ఆ సమయంలో, యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒక అదుల్లామీయుని దగ్గర ఉన్నాడు.

  4. ఆదికాండము 38:2సుమారు క్రీ.పూ. 1739

    అక్కడ ఒక కనానీయుడైన షూయ కుమార్తెను కలిశాడు. ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెతో లైంగికంగా కలుసుకున్నాడు;

  5. ఆదికాండము 38:3సుమారు క్రీ.పూ. 1738

    ఆమె గర్భవతియై కుమారున్ని కన్నది. అతనికి ఏరు అని పేరు పెట్టారు.

  6. ఆదికాండము 38:4సుమారు క్రీ.పూ. 1737

    ఆమె మరలా గర్భవతియై కుమారుని కన్నది, అతనికి ఓనాను అని పేరు పెట్టింది.

  7. ఆదికాండము 38:5సుమారు క్రీ.పూ. 1736

    ఆమె మరొక కుమారుని కన్నది, అతనికి షేలా అని పేరు పెట్టింది. ఆమె కజీబులో ఇతనికి జన్మనిచ్చింది.

  8. ఆదికాండము 38:6సుమారు క్రీ.పూ. 1736

    యూదా అతని మొదటి కుమారుడైన ఏరుకు తామారుతో పెళ్ళి చేశాడు.

  9. ఆదికాండము 38:7సుమారు క్రీ.పూ. 1736

    కానీ యూదా మొదటి కుమారుడైన ఏరు, యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి యెహోవా అతన్ని మరణానికి గురి చేశారు.

  10. ఆదికాండము 38:8సుమారు క్రీ.పూ. 1722

    అప్పుడు యూదా ఓనానుతో, “నీ అన్న భార్యతో పడుకోని మరిది ధర్మం నిర్వర్తించి నీ అన్నకు సంతానం కలిగేలా చేయి” అని అన్నాడు.

  11. ఆదికాండము 38:9సుమారు క్రీ.పూ. 1722

    అయితే పుట్టే బిడ్డ అతని బిడ్డగా ఉండదని ఓనానుకు తెలుసు; కాబట్టి తన అన్న భార్యతో పడుకున్న ప్రతిసారి, తన అన్నకు సంతానం కలుగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.

  12. ఆదికాండము 38:10సుమారు క్రీ.పూ. 1722

    అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు.

  13. ఆదికాండము 38:11సుమారు క్రీ.పూ. 1722

    అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది.

  14. ఆదికాండము 38:12సుమారు క్రీ.పూ. 1722

    చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు.

  15. ఆదికాండము 38:13సుమారు క్రీ.పూ. 1722

    “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు,

  16. ఆదికాండము 38:14సుమారు క్రీ.పూ. 1722

    తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.

  17. ఆదికాండము 38:15సుమారు క్రీ.పూ. 1722

    యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.

  18. ఆదికాండము 38:16సుమారు క్రీ.పూ. 1722

    ఆమె తన కోడలని తెలియక, దారిలో ఉన్న ఆమె వైపు వెళ్లి, “రా, నేను నీతో పడుకుంటాను” అని అన్నాడు. “నాతో పడుకోడానికి నాకు ఏమి ఇస్తావు?” అని ఆమె అడిగింది.

  19. ఆదికాండము 38:17సుమారు క్రీ.పూ. 1722

    అతడు, “నా మంద నుండి మేకపిల్లను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “అది పంపే వరకు నా దగ్గర ఏదైనా తాకట్టు పెడతావా?” అని అడిగింది.

  20. ఆదికాండము 38:18సుమారు క్రీ.పూ. 1722

    అతడు, “ఏం తాకట్టు పెట్టాలి?” అని అడిగాడు. ఆమె, “నీ ముద్ర, దాని దారం, నీ చేతిలో ఉన్న కర్ర” అని అన్నది. కాబట్టి అతడు అవి ఆమెకు ఇచ్చి ఆమెతో పడుకున్నాడు, అతని ద్వారా ఆమె గర్భవతి అయ్యింది.

  21. ఆదికాండము 38:19సుమారు క్రీ.పూ. 1722

    ఆమె వెళ్లి తన ముసుగు తీసివేసి తిరిగి తన విధవరాలి బట్టలు వేసుకుంది.

  22. ఆదికాండము 38:20సుమారు క్రీ.పూ. 1722

    అంతలో యూదా ఆ స్త్రీ దగ్గర తాకట్టు పెట్టినవి విడిపించుకోడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని ద్వారా మేకపిల్లను పంపాడు కానీ ఆమె అతనికి కనబడలేదు.

  23. ఆదికాండము 38:21సుమారు క్రీ.పూ. 1722

    అక్కడున్న మనుష్యులను, “ఎనయీము దారి ప్రక్కన ఉండే పుణ్యక్షేత్ర వేశ్య ఎక్కడుంది?” అని అడిగాడు. “ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య ఎవరు లేరు” అని వారన్నారు.

  24. ఆదికాండము 38:22సుమారు క్రీ.పూ. 1722

    కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగివెళ్లి, “నేను ఆమెను కనుగొనలేదు. అంతేకాక, అక్కడ ఉండే మనుష్యులు, ‘ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య లేదు’ అని అన్నారు” అని చెప్పాడు.

  25. ఆదికాండము 38:23సుమారు క్రీ.పూ. 1722

    అప్పుడు యూదా, “ఆమె తన దగ్గర ఉన్నవాటిని ఉంచుకోనివ్వండి, లేకపోతే మనం నవ్వుల పాలవుతాము. ఎంతైనా నేను ఆమెకు ఈ మేకపిల్లను పంపాను, కానీ నీకు ఆమె కనబడలేదు” అని అన్నాడు.