కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 38:24సుమారు క్రీ.పూ. 1722

    దాదాపు మూడు నెలలు తర్వాత, “నీ కోడలు తామారు వ్యభిచారిగా అపరాధం చేసింది, ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి” అని యూదాకు తెలియజేయబడింది. యూదా అన్నాడు, “ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను కాల్చి చంపండి!” అని అన్నాడు.

  2. ఆదికాండము 38:25సుమారు క్రీ.పూ. 1722

    ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది.

  3. ఆదికాండము 38:26సుమారు క్రీ.పూ. 1722

    యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు.

  4. ఆదికాండము 38:27సుమారు క్రీ.పూ. 1722

    ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.

  5. ఆదికాండము 38:28సుమారు క్రీ.పూ. 1722

    కాన్పు సమయంలో ఒక శిశువు బయటకు వస్తూ చేయి చాచాడు; మంత్రసాని ఎర్రటి నూలుదారం ఆ శిశువు చేతికి కట్టి, “ఇతడు మొదట బయటకు వచ్చినవాడు” అని అన్నది.

  6. ఆదికాండము 38:29సుమారు క్రీ.పూ. 1721

    అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు.

  7. ఆదికాండము 38:30సుమారు క్రీ.పూ. 1721

    తర్వాత చేతికి ఎర్రటి దారం ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.

  8. ఆదికాండము 39:1సుమారు క్రీ.పూ. 1728

    యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు.

  9. ఆదికాండము 39:2సుమారు క్రీ.పూ. 1728

    యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు.

  10. ఆదికాండము 39:3సుమారు క్రీ.పూ. 1728

    యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు

  11. ఆదికాండము 39:4సుమారు క్రీ.పూ. 1728

    యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు.

  12. ఆదికాండము 39:5సుమారు క్రీ.పూ. 1728

    తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది.

  13. ఆదికాండము 39:6సుమారు క్రీ.పూ. 1728

    కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు. యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు.

  14. ఆదికాండము 39:7సుమారు క్రీ.పూ. 1719

    కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది.

  15. ఆదికాండము 39:8సుమారు క్రీ.పూ. 1719

    కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు.

  16. ఆదికాండము 39:9సుమారు క్రీ.పూ. 1719

    ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు.

  17. ఆదికాండము 39:10సుమారు క్రీ.పూ. 1719

    ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు.

  18. ఆదికాండము 39:11సుమారు క్రీ.పూ. 1719

    ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు.

  19. ఆదికాండము 39:12సుమారు క్రీ.పూ. 1719

    ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు.

  20. ఆదికాండము 39:13సుమారు క్రీ.పూ. 1719

    అతడు తన అంగీని ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడని చూసి,

  21. ఆదికాండము 39:14సుమారు క్రీ.పూ. 1719

    తన ఇంటి పనివారిని పిలిచి, “చూడండి, నా భర్త మనలను అవమానించాలని ఈ హెబ్రీయున్ని తెచ్చాడు. అతడు నాతో శయనించాలని లోనికి వచ్చాడు కానీ నేను కేకలు పెట్టాను.

  22. ఆదికాండము 39:15సుమారు క్రీ.పూ. 1719

    సహాయం కోసం నేను పెట్టిన కేకలు విని, తన అంగీని నా ప్రక్కన వదిలేసి పారిపోయాడు” అని చెప్పింది.

  23. ఆదికాండము 39:16సుమారు క్రీ.పూ. 1719

    తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది.

  24. ఆదికాండము 39:17సుమారు క్రీ.పూ. 1719

    తర్వాత అతనికి ఈ కథ చెప్పింది: “నీవు తీసుకువచ్చిన ఆ హెబ్రీ బానిస నా దగ్గరకు వచ్చి నన్ను లోబరచుకోవాలని చూశాడు.

  25. ఆదికాండము 39:18సుమారు క్రీ.పూ. 1719

    నేను సహాయం కోసం కేకలు పెట్టిన వెంటనే, తన అంగీని నా ప్రక్కన వదిలేసి ఇంట్లోనుండి పారిపోయాడు.”