కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 40:21సుమారు క్రీ.పూ. 1717

    గిన్నె అందించేవారి నాయకున్ని అతని స్థానం తిరిగి ఇచ్చాడు కాబట్టి మరలా అతడు ఫరో చేతికి గిన్నె అందించాడు.

  2. ఆదికాండము 40:22సుమారు క్రీ.పూ. 1717

    కానీ యోసేపు కల భావం చెప్పినట్టే, అతడు రొట్టెలు కాల్చేవారి నాయకున్ని వ్రేలాడదీశాడు.

  3. ఆదికాండము 40:23సుమారు క్రీ.పూ. 1717

    అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు; అతన్ని మరచిపోయాడు.

  4. ఆదికాండము 41:1సుమారు క్రీ.పూ. 1715

    రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు,

  5. ఆదికాండము 41:2సుమారు క్రీ.పూ. 1715

    నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి.

  6. ఆదికాండము 41:3సుమారు క్రీ.పూ. 1715

    వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి.

  7. ఆదికాండము 41:4సుమారు క్రీ.పూ. 1715

    చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు.

  8. ఆదికాండము 41:5సుమారు క్రీ.పూ. 1715

    మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి.

  9. ఆదికాండము 41:6సుమారు క్రీ.పూ. 1715

    వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి.

  10. ఆదికాండము 41:7సుమారు క్రీ.పూ. 1715

    పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు.

  11. ఆదికాండము 41:8సుమారు క్రీ.పూ. 1715

    ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు.

  12. ఆదికాండము 41:9సుమారు క్రీ.పూ. 1715

    అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి.

  13. ఆదికాండము 41:10సుమారు క్రీ.పూ. 1715

    ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు.

  14. ఆదికాండము 41:11సుమారు క్రీ.పూ. 1715

    మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది.

  15. ఆదికాండము 41:12సుమారు క్రీ.పూ. 1715

    అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు.

  16. ఆదికాండము 41:13సుమారు క్రీ.పూ. 1715

    అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.”

  17. ఆదికాండము 41:14సుమారు క్రీ.పూ. 1715

    అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు.

  18. ఆదికాండము 41:15సుమారు క్రీ.పూ. 1715

    ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు.

  19. ఆదికాండము 41:16సుమారు క్రీ.పూ. 1715

    అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు.

  20. ఆదికాండము 41:17సుమారు క్రీ.పూ. 1715

    అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను,

  21. ఆదికాండము 41:18సుమారు క్రీ.పూ. 1715

    నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి.

  22. ఆదికాండము 41:19సుమారు క్రీ.పూ. 1715

    వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు.

  23. ఆదికాండము 41:20సుమారు క్రీ.పూ. 1715

    బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి.

  24. ఆదికాండము 41:21సుమారు క్రీ.పూ. 1715

    కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను.

  25. ఆదికాండము 41:22సుమారు క్రీ.పూ. 1715

    “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి.