- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 36:3సుమారు క్రీ.పూ. 1796
అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు.
- ఆదికాండము 36:4సుమారు క్రీ.పూ. 1796
ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది.
- ఆదికాండము 36:5సుమారు క్రీ.పూ. 1796
ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు.
- ఆదికాండము 36:6సుమారు క్రీ.పూ. 1740
ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు.
- ఆదికాండము 36:7సుమారు క్రీ.పూ. 1740
వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు.
- ఆదికాండము 36:8సుమారు క్రీ.పూ. 1740
కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.
- ఆదికాండము 36:9సుమారు క్రీ.పూ. 1740
శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి:
- ఆదికాండము 36:10సుమారు క్రీ.పూ. 1774
ఏశావు కుమారులు: ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు.
- ఆదికాండము 36:11సుమారు క్రీ.పూ. 1734
ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు.
- ఆదికాండము 36:12సుమారు క్రీ.పూ. 1734
ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
- ఆదికాండము 36:13సుమారు క్రీ.పూ. 1734
రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
- ఆదికాండము 36:14సుమారు క్రీ.పూ. 1712
ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: యూషు, యాలాము, కోరహు.
- ఆదికాండము 36:15సుమారు క్రీ.పూ. 1712
ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు,
- ఆదికాండము 36:16సుమారు క్రీ.పూ. 1712
కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
- ఆదికాండము 36:17సుమారు క్రీ.పూ. 1712
ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
- ఆదికాండము 36:18సుమారు క్రీ.పూ. 1712
ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు.
- ఆదికాండము 36:19సుమారు క్రీ.పూ. 1712
వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.
- ఆదికాండము 36:20సుమారు క్రీ.పూ. 1806
ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
- ఆదికాండము 36:21సుమారు క్రీ.పూ. 1800
దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.
- ఆదికాండము 36:22సుమారు క్రీ.పూ. 1756
లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
- ఆదికాండము 36:23సుమారు క్రీ.పూ. 1756
శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము.
- ఆదికాండము 36:24సుమారు క్రీ.పూ. 1756
సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు.
- ఆదికాండము 36:25సుమారు క్రీ.పూ. 1756
అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా.
- ఆదికాండము 36:26సుమారు క్రీ.పూ. 1756
దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
- ఆదికాండము 36:27సుమారు క్రీ.పూ. 1756
ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను.