కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 34:13సుమారు క్రీ.పూ. 1732

    వారి సోదరియైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది కాబట్టి యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో మోసపూరితంగా జవాబిచ్చారు.

  2. ఆదికాండము 34:14సుమారు క్రీ.పూ. 1732

    వారు అన్నారు, “అలా మేము చేయలేము; సున్నతిలేని మనుష్యునికి మా సోదరిని ఇవ్వలేము. మాకది అవమానము.

  3. ఆదికాండము 34:15సుమారు క్రీ.పూ. 1732

    ఒక షరతుతో మాత్రమే మీతో ఒప్పందం లోనికి వస్తాం; మీ మగవారందరు సున్నతి చేసుకుని మాలాగా మారాలి.

  4. ఆదికాండము 34:16సుమారు క్రీ.పూ. 1732

    అప్పుడు మా కుమార్తెలను మీకు ఇస్తాము, మీ కుమార్తెలను మేము తీసుకుని మీతో నివసిస్తాం, మీతో ఒకే ప్రజలుగా అవుతాము.

  5. ఆదికాండము 34:17సుమారు క్రీ.పూ. 1732

    మీరు సున్నతి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మా సోదరిని తీసుకుని వెళ్లిపోతాము.”

  6. ఆదికాండము 34:18సుమారు క్రీ.పూ. 1732

    వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది.

  7. ఆదికాండము 34:19సుమారు క్రీ.పూ. 1732

    ఆ యువకుడు, తన తండ్రి ఇంటి అంతటిలో ఘనత పొందినవాడు, యాకోబు కుమార్తె దీనాను ఎంతో కోరుకున్నాడు కాబట్టి వారు చెప్పింది చేయడానికి ఆలస్యం చేయలేదు.

  8. ఆదికాండము 34:20సుమారు క్రీ.పూ. 1732

    కాబట్టి హమోరు అతని కుమారుడు షెకెము వారి పట్టణ నాయకులతో మాట్లాడడానికి పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లారు.

  9. ఆదికాండము 34:21సుమారు క్రీ.పూ. 1732

    “ఈ మనుష్యులు మనతో స్నేహంగా ఉంటున్నారు” అని వారు అన్నారు. “వారిని మన దేశంలో నివసిస్తూ, వ్యాపారం చేయనిద్దాం; దేశంలో వారి కోసం చాల స్థలం ఉంది. మనం వారి కుమార్తెలను పెళ్ళి చేసుకుందాం, వారు మన వారిని చేసుకుంటారు.

  10. ఆదికాండము 34:22సుమారు క్రీ.పూ. 1732

    అయితే వారు మనతో నివసిస్తూ, మనతో ఒకే ప్రజలుగా ఉండాలంటే మన మగవారందరు వారిలా సున్నతి చేసుకోవాలని ఒక షరతు పెట్టారు.

  11. ఆదికాండము 34:23సుమారు క్రీ.పూ. 1732

    వారి పశువులు, వారి ఆస్తులు, వారి జంతువులన్నీ మనవి అవుతాయి కదా! కాబట్టి వారి షరతులు ఒప్పుకుందాము, వారు మన మధ్య స్థిరపడతారు.”

  12. ఆదికాండము 34:24సుమారు క్రీ.పూ. 1732

    పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లిన మనుష్యులందరు హమోరు, అతని కుమారుడైన షెకెముతో ఏకీభవించారు, పట్టణంలో ప్రతి మగవాడు సున్నతి పొందాడు.

  13. ఆదికాండము 34:25సుమారు క్రీ.పూ. 1732

    మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు.

  14. ఆదికాండము 34:26సుమారు క్రీ.పూ. 1732

    వారు హమోరును, అతని కుమారుడైన షెకెమును ఖడ్గంతో చంపి, షెకెము ఇంటి నుండి దీనాను తీసుకెళ్లారు.

  15. ఆదికాండము 34:27సుమారు క్రీ.పూ. 1732

    యాకోబు కుమారులు వారిని చంపి, తమ సోదరి అపవిత్రం చేయబడిన పట్టణాన్ని దోచుకున్నారు.

  16. ఆదికాండము 34:28సుమారు క్రీ.పూ. 1732

    వారి మందలను, పశువులను, గాడిదలను, వారి పట్టణంలో, పొలాల్లో ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు.

  17. ఆదికాండము 34:29సుమారు క్రీ.పూ. 1732

    వారి ధనమంతటిని, వారి స్త్రీలనందరిని, పిల్లలందరిని తీసుకెళ్లి, వారి ఇండ్లలో ఉన్నదంతటిని దోచుకున్నారు.

  18. ఆదికాండము 34:30సుమారు క్రీ.పూ. 1732

    అప్పుడు యాకోబు షిమ్యోను, లేవీతో అన్నాడు, “ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను చెడ్డవానిగా చూసేలా ఈ కష్టం నా మీదికి తెచ్చారు. మేము కొద్ది మందిమి, ఒకవేళ వారు ఏకమై నా మీద దాడి చేస్తే, నేను నా ఇంటివారు నాశనమవుతాము.”

  19. ఆదికాండము 34:31సుమారు క్రీ.పూ. 1732

    అయితే వారు, “మా సోదరి వేశ్యగా పరిగణించబడాలా?” అని జవాబిచ్చారు.

  20. దేవుడు యాకోబుతో, “నీవు లేచి, బేతేలుకు వెళ్లి, అక్కడ స్థిరపడు, నీవు నీ సోదరుడైన ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు” అని అన్నారు.

  21. కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి.

  22. తర్వాత నాతో బేతేలుకు రండి, అక్కడ నా శ్రమ దినాన నాకు జవాబిచ్చిన దేవునికి బలిపీఠం కడతాను.”

  23. కాబట్టి వారు తమ దగ్గర ఉన్న ఇతర దేవతలను, చెవి పోగులను యాకోబుకు ఇచ్చారు, యాకోబు వాటిని షెకెము ప్రాంతంలో ఒక సింధూర వృక్షం క్రింద పాతిపెట్టాడు.

  24. తర్వాత వారు బయలుదేరారు. వారి చుట్టూ ఉన్న పట్టణాలకు దేవుని భయం పట్టుకుంది, కాబట్టి వారిని ఎవ్వరూ వెంటాడలేదు.

  25. యాకోబు, అతనితో ఉన్న ప్రజలందరు కనాను దేశంలో ఉన్న లూజుకు (అంటే బేతేలుకు) వచ్చారు.