- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 32:15సుమారు క్రీ.పూ. 1739
ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు.
- ఆదికాండము 32:16సుమారు క్రీ.పూ. 1739
వాటిని మందలు మందలుగా విభజించి, తన సేవకులకు అప్పగించి, తన సేవకులతో, “మంద మందకు నడుమ ఖాళీ ఉంచి, నాకంటే ముందుగా వెళ్లండి” అని అన్నాడు.
- ఆదికాండము 32:17సుమారు క్రీ.పూ. 1739
వారిలో మొదట నిలబడి ఉన్నవాన్ని ఇలా హెచ్చరించాడు: “నా సోదరుడు ఏశావు మీకు ఎదురై, ‘నీవు ఎవరి సంబంధివి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్న ఈ జంతువులన్నీ ఎవరివి?’ అని అడిగితే,
- ఆదికాండము 32:18సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు నీవు ఇలా చెప్పాలి, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, నా ప్రభువైన ఏశావుకు కానుకగా పంపబడ్డాయి, అతడు వెనుక వస్తున్నాడు.’ ”
- ఆదికాండము 32:19సుమారు క్రీ.పూ. 1739
అతడు మందల వెంట వెళ్తున్న రెండవ వానికి, మూడవ వానికి, మిగతా అందరికి అలాగే సూచించాడు: “మీరు ఏశావును కలిసినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి.
- ఆదికాండము 32:20సుమారు క్రీ.పూ. 1739
నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు.
- ఆదికాండము 32:21సుమారు క్రీ.పూ. 1739
కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు.
- ఆదికాండము 32:22సుమారు క్రీ.పూ. 1739
ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు.
- ఆదికాండము 32:23సుమారు క్రీ.పూ. 1739
వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు.
- ఆదికాండము 32:24సుమారు క్రీ.పూ. 1739
యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు.
- ఆదికాండము 32:25సుమారు క్రీ.పూ. 1739
అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది.
- ఆదికాండము 32:26సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు అతడు, “నన్ను వెళ్లనివ్వు, తెల్లవారింది” అన్నాడు. కానీ యాకోబు, “నన్ను దీవిస్తేనే గాని, నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.
- ఆదికాండము 32:27సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు.
- ఆదికాండము 32:28సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు, ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు.
- ఆదికాండము 32:29సుమారు క్రీ.పూ. 1739
యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.
- ఆదికాండము 32:30సుమారు క్రీ.పూ. 1739
యాకోబు ఆ స్థలానికి పెనీయేలు అని పేరు పెట్టి, “నేను దేవున్ని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కింది” అని అన్నాడు.
- ఆదికాండము 32:31సుమారు క్రీ.పూ. 1739
యాకోబు పెనీయేలు నుండి వెళ్లే సమయంలో సూర్యోదయం అయ్యింది, అతడు తొడకుంటుతూ నడిచాడు.
- ఆదికాండము 32:32సుమారు క్రీ.పూ. 1739
కాబట్టి యాకోబు తొడగూటి మీది తుంటినరం మీద దెబ్బ తిన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు నేటి వరకు తొడగూటి మీద ఉన్న తుంటినరం తినరు.
- ఆదికాండము 33:1సుమారు క్రీ.పూ. 1739
యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు, ఏశావు తన నాలుగువందలమంది మనుష్యులతో వస్తూ కనిపించాడు; కాబట్టి అతడు పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించాడు.
- ఆదికాండము 33:2సుమారు క్రీ.పూ. 1739
అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు.
- ఆదికాండము 33:3సుమారు క్రీ.పూ. 1739
అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.
- ఆదికాండము 33:4సుమారు క్రీ.పూ. 1739
అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు.
- ఆదికాండము 33:5సుమారు క్రీ.పూ. 1739
ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.
- ఆదికాండము 33:6సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు.
- ఆదికాండము 33:7సుమారు క్రీ.పూ. 1739
తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు.