కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 31:20సుమారు క్రీ.పూ. 1739

    అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు.

  2. ఆదికాండము 31:21సుమారు క్రీ.పూ. 1739

    తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు.

  3. ఆదికాండము 31:22సుమారు క్రీ.పూ. 1739

    మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది.

  4. ఆదికాండము 31:23సుమారు క్రీ.పూ. 1739

    లాబాను తన బంధువులను తీసుకుని, యాకోబును ఏడు రోజులు వెంటాడి గిలాదు కొండ సీమలో అతన్ని ఎదుర్కొన్నాడు.

  5. ఆదికాండము 31:24సుమారు క్రీ.పూ. 1739

    రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు.

  6. ఆదికాండము 31:25సుమారు క్రీ.పూ. 1739

    లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు.

  7. ఆదికాండము 31:26సుమారు క్రీ.పూ. 1739

    అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు.

  8. ఆదికాండము 31:27సుమారు క్రీ.పూ. 1739

    నీవెందుకు రహస్యంగా పారిపోయి, నన్ను మోసం చేశావు? మృదంగ సితారాల సంగీతంతో నిన్ను ఆనందంగా పంపేవాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు?

  9. ఆదికాండము 31:28సుమారు క్రీ.పూ. 1739

    నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు.

  10. ఆదికాండము 31:29సుమారు క్రీ.పూ. 1739

    నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు.

  11. ఆదికాండము 31:30సుమారు క్రీ.పూ. 1739

    సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?”

  12. ఆదికాండము 31:31సుమారు క్రీ.పూ. 1739

    యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను.

  13. ఆదికాండము 31:32సుమారు క్రీ.పూ. 1739

    అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు.

  14. ఆదికాండము 31:33సుమారు క్రీ.పూ. 1739

    లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు.

  15. ఆదికాండము 31:34సుమారు క్రీ.పూ. 1739

    రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు.

  16. ఆదికాండము 31:35సుమారు క్రీ.పూ. 1739

    రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు.

  17. ఆదికాండము 31:36సుమారు క్రీ.పూ. 1739

    యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు?

  18. ఆదికాండము 31:37సుమారు క్రీ.పూ. 1739

    నా సామానంతా వెదికావు కదా, నీ ఇంటికి సంబంధించింది నీకు ఏమి దొరికింది? నీ బంధువుల ఎదుట, మా వారి ఎదుట ఉంచు, వారు మన మధ్యలో తీర్పు తీర్చనివ్వు.

  19. ఆదికాండము 31:38సుమారు క్రీ.పూ. 1739

    “ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలకు, మేకలకు గర్భస్రావం కలుగలేదు లేదా నీ మందలోని పొట్టేళ్లను నేనేమి తినలేదు.

  20. ఆదికాండము 31:39సుమారు క్రీ.పూ. 1739

    అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు.

  21. ఆదికాండము 31:40సుమారు క్రీ.పూ. 1739

    నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది.

  22. ఆదికాండము 31:41సుమారు క్రీ.పూ. 1739

    నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు.

  23. ఆదికాండము 31:42సుమారు క్రీ.పూ. 1739

    ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”

  24. ఆదికాండము 31:43సుమారు క్రీ.పూ. 1739

    లాబాను యాకోబుతో, “ఈ స్త్రీలు నా కుమార్తెలు, పిల్లలు నా పిల్లలు, మందలు నా మందలు. అయినా ఇప్పుడు ఈ నా కుమార్తెల గురించి, లేదా వారు కన్న పిల్లల గురించి నేనేమి చేయగలను?

  25. ఆదికాండము 31:44సుమారు క్రీ.పూ. 1739

    ఇప్పుడు రా, మనం నిబంధన చేసుకుందాము. అది మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉంటుంది” అని అన్నాడు.