- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 31:45సుమారు క్రీ.పూ. 1739
కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు.
- ఆదికాండము 31:46సుమారు క్రీ.పూ. 1739
అతడు తన బంధువులతో, “కొన్ని రాళ్లు పోగు చేయండి” అని అన్నాడు. వారు రాళ్లు తెచ్చి కుప్పగా పోశారు, ఆ రాళ్లకుప్ప దగ్గర వారు భోజనం చేశారు.
- ఆదికాండము 31:47సుమారు క్రీ.పూ. 1739
లాబాను దానికి యెగర్ శాహదూతా అని పేరు పెట్టాడు, యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాడు.
- ఆదికాండము 31:48సుమారు క్రీ.పూ. 1739
లాబాను, “ఈ రోజున ఈ రాళ్ల గుట్ట నీకు, నాకు మధ్య సాక్షి” అన్నాడు. అందుకే అది గలీదు అని పిలువబడింది.
- ఆదికాండము 31:49సుమారు క్రీ.పూ. 1739
ఈ స్థలం మిస్పా అని కూడా పిలువబడేది, ఎందుకంటే అతడు అన్నాడు, “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా నాకు నీకు మధ్య జరిగేది గమనించును గాక.
- ఆదికాండము 31:50సుమారు క్రీ.పూ. 1739
నీవు నా కుమార్తెలను బాధ పెడితే లేదా నా కుమార్తెలు ఉన్నా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకుంటే, మనతో ఎవరు లేకపోయినా, మన మధ్యలో సాక్షిగా దేవుడు ఉన్నారని గుర్తుంచుకో.”
- ఆదికాండము 31:51సుమారు క్రీ.పూ. 1739
లాబాను ఇంకా యాకోబుతో, “ఇదిగో రాళ్లకుప్ప, ఇదిగో నీకు నాకు మధ్య నిలబెట్టబడి ఉన్న ఈ రాతి స్తంభము.
- ఆదికాండము 31:52సుమారు క్రీ.పూ. 1739
ఈ రాళ్లకుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి, నీకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నేను రాను, నాకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నీవు రావద్దు.
- ఆదికాండము 31:53సుమారు క్రీ.పూ. 1739
అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.
- ఆదికాండము 31:54సుమారు క్రీ.పూ. 1739
అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు.
- ఆదికాండము 31:55సుమారు క్రీ.పూ. 1739
మర్నాడు వేకువజామున లాబాను మనవళ్లను, అతని కుమార్తెలను ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
- ఆదికాండము 32:1సుమారు క్రీ.పూ. 1739
యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు.
- ఆదికాండము 32:2సుమారు క్రీ.పూ. 1739
యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.
- ఆదికాండము 32:3సుమారు క్రీ.పూ. 1739
యాకోబు ఎదోము దేశంలోని శేయీరు ప్రాంతంలో ఉన్న తన సోదరుడైన ఏశావు దగ్గరకు తనకంటే ముందు దూతలను పంపాడు.
- ఆదికాండము 32:4సుమారు క్రీ.పూ. 1739
ఆయన వారికి ఇలా సూచించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఇలా చెప్పాలి: ‘మీ సేవకుడైన యాకోబు చెప్తున్నాడు, ఇంతవరకు నేను లాబాను దగ్గరే ఉన్నాను.
- ఆదికాండము 32:5సుమారు క్రీ.పూ. 1739
నాకు మందలు గాడిదలు గొర్రెలు మేకలు, దాసదాసీలు ఉన్నారు. నీ దృష్టిలో దయ పొందడానికి ఇప్పుడు నా ప్రభువుకు ఈ వర్తమానం పంపుతున్నాను.’ ”
- ఆదికాండము 32:6సుమారు క్రీ.పూ. 1739
ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు.
- ఆదికాండము 32:7సుమారు క్రీ.పూ. 1739
ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు.
- ఆదికాండము 32:8సుమారు క్రీ.పూ. 1739
“ఒకవేళ ఏశావు ఒక గుంపు మీద దాడి చేస్తే, ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు” అని అతడు అనుకున్నాడు.
- ఆదికాండము 32:9సుమారు క్రీ.పూ. 1739
తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా,
- ఆదికాండము 32:10సుమారు క్రీ.పూ. 1739
మీరు మీ సేవకునికి చూపిన దయ నమ్మకత్వానికి నేను యోగ్యుడను కాను. నేను యొర్దాను దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా అయ్యాను.
- ఆదికాండము 32:11సుమారు క్రీ.పూ. 1739
దేవా, నా సోదరుడు ఏశావు చేతిలో పడకుండ నన్ను తప్పించు, ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లలను వారి తల్లులతో పాటు చంపేస్తాడని నాకు భయమేస్తుంది.
- ఆదికాండము 32:12సుమారు క్రీ.పూ. 1739
కానీ మీరు, ‘నేను ఖచ్చితంగా నిన్ను వృద్ధి చేసి నీ సంతానాన్ని లెక్కించబడలేని సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను’ అని అన్నారు” అని ప్రార్థన చేశాడు.
- ఆదికాండము 32:13సుమారు క్రీ.పూ. 1739
ఆ రాత్రి యాకోబు అక్కడే గడిపి తన దగ్గర ఉన్న దాంట్లో నుండి తన అన్నయైన ఏశావుకు కానుక ఇవ్వడానికి పెట్టినవి:
- ఆదికాండము 32:14సుమారు క్రీ.పూ. 1739
రెండువందల మేకలు, ఇరవై మేకపోతులు, రెండువందల గొర్రెలు, ఇరవై పొట్టేళ్లు,