- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 33:8సుమారు క్రీ.పూ. 1739
ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు. “నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు.
- ఆదికాండము 33:9సుమారు క్రీ.పూ. 1739
అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు.
- ఆదికాండము 33:10సుమారు క్రీ.పూ. 1739
యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు.
- ఆదికాండము 33:11సుమారు క్రీ.పూ. 1739
దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.
- ఆదికాండము 33:12సుమారు క్రీ.పూ. 1739
అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు.
- ఆదికాండము 33:13సుమారు క్రీ.పూ. 1739
కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి.
- ఆదికాండము 33:14సుమారు క్రీ.పూ. 1739
కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు.
- ఆదికాండము 33:15సుమారు క్రీ.పూ. 1739
అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.
- ఆదికాండము 33:16సుమారు క్రీ.పూ. 1739
కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు.
- ఆదికాండము 33:17సుమారు క్రీ.పూ. 1739
అయితే యాకోబు మాత్రం సుక్కోతుకు వెళ్లాడు, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టించుకుని, పశువులకు పాకలు వేశాడు. అందుకే ఆ స్థలం సుక్కోతు అని పిలువబడింది.
- ఆదికాండము 33:18సుమారు క్రీ.పూ. 1739
యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు.
- ఆదికాండము 33:19సుమారు క్రీ.పూ. 1739
తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు కొన్నాడు.
- ఆదికాండము 33:20సుమారు క్రీ.పూ. 1739
అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
- ఆదికాండము 34:1సుమారు క్రీ.పూ. 1732
యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తెయైన దీనా ఆ దేశంలోని యువతులను దర్శించడానికి వెళ్లింది.
- ఆదికాండము 34:2సుమారు క్రీ.పూ. 1732
ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
- ఆదికాండము 34:3సుమారు క్రీ.పూ. 1732
అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు.
- ఆదికాండము 34:4సుమారు క్రీ.పూ. 1732
షెకెము తన తండ్రి హమోరుతో, “ఈ అమ్మాయిని నాకు భార్యగా చేయండి” అని అన్నాడు.
- ఆదికాండము 34:5సుమారు క్రీ.పూ. 1732
యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు.
- ఆదికాండము 34:6సుమారు క్రీ.పూ. 1732
అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు.
- ఆదికాండము 34:7సుమారు క్రీ.పూ. 1732
ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు.
- ఆదికాండము 34:8సుమారు క్రీ.పూ. 1732
కానీ హమోరు వారితో, “నా కుమారుడు షెకెము మీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి.
- ఆదికాండము 34:9సుమారు క్రీ.పూ. 1732
మనం వియ్యమందుకుందాం; మీ కుమార్తెలను మాకు, మా కుమార్తెలను మీకు ఇచ్చి పుచ్చుకుందాము.
- ఆదికాండము 34:10సుమారు క్రీ.పూ. 1732
మీరు మాతో నివసించవచ్చు, ఈ దేశం మీ ఎదుట ఉంది. ఇక్కడ ఉండండి, వ్యాపారం చేయండి, ఆస్తి సంపాదించండి” అని అన్నాడు.
- ఆదికాండము 34:11సుమారు క్రీ.పూ. 1732
తర్వాత షెకెము దీనా తండ్రితో, సోదరులతో, “మీ దృష్టిలో నేను దయ పొందితే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను.
- ఆదికాండము 34:12సుమారు క్రీ.పూ. 1732
వధువు కట్నం, నేను తెచ్చే బహుమానం ఎంతైనా సరే, మీరు అడిగింది నేను ఇస్తాను. యువతిని మాత్రం నాకు భార్యగా ఇవ్వండి” అని అడిగాడు.