- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 30:13సుమారు క్రీ.పూ. 1747
అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
- ఆదికాండము 30:14సుమారు క్రీ.పూ. 1748
గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.
- ఆదికాండము 30:15సుమారు క్రీ.పూ. 1748
అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది. రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది.
- ఆదికాండము 30:16సుమారు క్రీ.పూ. 1748
సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు.
- ఆదికాండము 30:17సుమారు క్రీ.పూ. 1747
దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది.
- ఆదికాండము 30:18సుమారు క్రీ.పూ. 1747
అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.
- ఆదికాండము 30:19సుమారు క్రీ.పూ. 1747
ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.
- ఆదికాండము 30:20సుమారు క్రీ.పూ. 1746
అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.
- ఆదికాండము 30:21సుమారు క్రీ.పూ. 1745
కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది.
- ఆదికాండము 30:22సుమారు క్రీ.పూ. 1745
తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు.
- ఆదికాండము 30:23సుమారు క్రీ.పూ. 1745
ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది.
- ఆదికాండము 30:24సుమారు క్రీ.పూ. 1745
ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టి, “యెహోవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇచ్చును గాక” అని అన్నది.
- ఆదికాండము 30:25సుమారు క్రీ.పూ. 1745
రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు.
- ఆదికాండము 30:26సుమారు క్రీ.పూ. 1745
నా భార్యలను, పిల్లలను నాతో పంపించు. వారి కోసమే నేను నీకు సేవ చేశాను, ఇక నేను వెళ్తాను. నేను ఎంతగా నీకోసం పని చేశానో నీకు తెలుసు” అని అన్నాడు.
- ఆదికాండము 30:27సుమారు క్రీ.పూ. 1745
అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను.
- ఆదికాండము 30:28సుమారు క్రీ.పూ. 1745
నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు.
- ఆదికాండము 30:29సుమారు క్రీ.పూ. 1745
యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు.
- ఆదికాండము 30:30సుమారు క్రీ.పూ. 1745
నేను రాకముందు నీకున్న కొంచెం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినది, నేను ఏ చోట ఉన్నా యెహోవా నిన్ను దీవించారు. అయితే, నా సొంత ఇంటివారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి?” అని అన్నాడు.
- ఆదికాండము 30:31సుమారు క్రీ.పూ. 1745
లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను:
- ఆదికాండము 30:32సుమారు క్రీ.పూ. 1745
ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు.
- ఆదికాండము 30:33సుమారు క్రీ.పూ. 1745
నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.
- ఆదికాండము 30:34సుమారు క్రీ.పూ. 1745
లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.
- ఆదికాండము 30:35సుమారు క్రీ.పూ. 1745
ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు.
- ఆదికాండము 30:36సుమారు క్రీ.పూ. 1745
అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.
- ఆదికాండము 30:37సుమారు క్రీ.పూ. 1745
అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.