కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 29:23సుమారు క్రీ.పూ. 1753

    అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు.

  2. ఆదికాండము 29:24సుమారు క్రీ.పూ. 1753

    లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు.

  3. ఆదికాండము 29:25సుమారు క్రీ.పూ. 1753

    తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.

  4. ఆదికాండము 29:26సుమారు క్రీ.పూ. 1753

    లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు.

  5. ఆదికాండము 29:27సుమారు క్రీ.పూ. 1753

    లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను” అని అన్నాడు.

  6. ఆదికాండము 29:28సుమారు క్రీ.పూ. 1753

    యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.

  7. ఆదికాండము 29:29సుమారు క్రీ.పూ. 1753

    లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు.

  8. ఆదికాండము 29:30సుమారు క్రీ.పూ. 1753

    యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.

  9. ఆదికాండము 29:31సుమారు క్రీ.పూ. 1753

    లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది.

  10. ఆదికాండము 29:32సుమారు క్రీ.పూ. 1752

    లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.

  11. ఆదికాండము 29:33సుమారు క్రీ.పూ. 1751

    ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నేను ప్రేమించబడడం లేదని యెహోవా విన్నారు కాబట్టి, ఇతన్ని కూడా నాకు ఇచ్చారు” అని చెప్పి, అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది.

  12. ఆదికాండము 29:34సుమారు క్రీ.పూ. 1750

    లేయా మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నా భర్తకు నేను ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు” అని ఆమె అతనికి లేవీ అని పేరు పెట్టింది.

  13. ఆదికాండము 29:35సుమారు క్రీ.పూ. 1749

    ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అని ఆమె అతనికి యూదా అని పెట్టింది. తర్వాత ఆమె పిల్లలు కనడం ఆగిపోయింది.

  14. రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.

  15. యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.

  16. అప్పుడు ఆమె, “ఇదిగో, నా దాసి బిల్హా. ఈమెతో వెళ్లు, తద్వార ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆమె ద్వార నేను కూడా కుటుంబం కట్టుకుంటాను” అని చెప్పింది.

  17. కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు.

  18. బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది.

  19. ఆదికాండము 30:6సుమారు క్రీ.పూ. 1748

    అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను అని పేరు పెట్టింది.

  20. ఆదికాండము 30:7సుమారు క్రీ.పూ. 1747

    రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  21. ఆదికాండము 30:8సుమారు క్రీ.పూ. 1747

    అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

  22. ఆదికాండము 30:9సుమారు క్రీ.పూ. 1748

    లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.

  23. ఆదికాండము 30:10సుమారు క్రీ.పూ. 1748

    లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది.

  24. ఆదికాండము 30:11సుమారు క్రీ.పూ. 1748

    అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!” అని అన్నది. కాబట్టి అతనికి గాదు అని పేరు పెట్టింది.

  25. ఆదికాండము 30:12సుమారు క్రీ.పూ. 1748

    లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది.