కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 31:5సుమారు క్రీ.పూ. 713

    అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.

  2. యెషయా 31:6సుమారు క్రీ.పూ. 713

    ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి.

  3. యెషయా 31:7సుమారు క్రీ.పూ. 713

    మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు.

  4. యెషయా 31:8సుమారు క్రీ.పూ. 713

    “మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది. మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది. వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.

  5. యెషయా 31:9సుమారు క్రీ.పూ. 713

    వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది; వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు” అని యెహోవా ప్రకటించారు. సీయోనులో ఆయన అగ్ని యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.

  6. యెషయా 32:1సుమారు క్రీ.పూ. 713

    చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు అధికారులు న్యాయంగా పాలిస్తారు.

  7. యెషయా 32:2సుమారు క్రీ.పూ. 713

    వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా తుఫానులో ఆశ్రయంగా ఎడారిలో నీటి ప్రవాహాల్లా ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.

  8. యెషయా 32:3సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు చూసేవారి కళ్లు ఎప్పుడూ మూసుకుపోవు, వినేవారి చెవులు వింటాయి.

  9. యెషయా 32:4సుమారు క్రీ.పూ. 713

    భయంతో ఉండే హృదయం తెలుసుకొని, గ్రహిస్తుంది, నత్తిగల నాలుక చక్కగా, స్పష్టంగా మాట్లాడుతుంది.

  10. యెషయా 32:5సుమారు క్రీ.పూ. 713

    ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు. దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు.

  11. యెషయా 32:6సుమారు క్రీ.పూ. 713

    మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారు, వారి హృదయాలు చెడు ఆలోచిస్తాయి; వారు భక్తిహీనతను పాటిస్తూ యెహోవా గురించి తప్పుడు వార్త ప్రకటిస్తారు; ఆకలితో ఉన్నవారికి ఏమి లేకుండా చేస్తారు దప్పికతో ఉన్నవారికి నీళ్లు లేకుండా చేస్తారు.

  12. యెషయా 32:7సుమారు క్రీ.పూ. 713

    దుష్టులు చెడ్డ పద్ధతులను ఉపయోగిస్తారు, నిరుపేదలు న్యాయమైన అభ్యర్థన చేసినా, అబద్ధాలతో పేదవారిని నాశనం చేయడానికి వారు చెడ్డ ఆలోచనలు చేస్తారు.

  13. యెషయా 32:8సుమారు క్రీ.పూ. 713

    అయితే గొప్పవారు గొప్ప ఆలోచనలు చేస్తారు, వారు చేసే గొప్ప పనులను బట్టి నిలబడతారు.

  14. యెషయా 32:9సుమారు క్రీ.పూ. 713

    ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా, లేచి నా మాట వినండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, నేను చెప్పే మాట వినండి!

  15. యెషయా 32:10సుమారు క్రీ.పూ. 713

    ఇక ఒక సంవత్సరంలో, భద్రంగా ఉన్న మీరు భయంతో వణుకుతారు; ద్రాక్ష పంట పడిపోతుంది. పండ్లు పంటకు రావు.

  16. యెషయా 32:11సుమారు క్రీ.పూ. 713

    ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి మీ మంచి బట్టలు తీసివేసి మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.

  17. యెషయా 32:12సుమారు క్రీ.పూ. 713

    ఆహ్లాదకరమైన పొలాల గురించి ఫలించే ద్రాక్షతీగెల గురించి మీ రొమ్ము కొట్టుకోండి.

  18. యెషయా 32:13సుమారు క్రీ.పూ. 713

    నా ప్రజల భూమిలో గచ్చపొదలు, ముళ్ళచెట్లు పెరుగుతాయి. ఆనందోత్సాహాలతో ఉన్న ఇళ్ళన్నిటి కోసం ఉల్లాసంతో ఉన్న ఈ పట్టణం కోసం దుఃఖించండి.

  19. యెషయా 32:14సుమారు క్రీ.పూ. 713

    కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,

  20. యెషయా 32:15సుమారు క్రీ.పూ. 713

    పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి. తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా, ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి.

  21. యెషయా 32:16సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది, ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది.

  22. యెషయా 32:17సుమారు క్రీ.పూ. 713

    సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది; దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి.

  23. యెషయా 32:18సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో సురక్షితమైన ఇళ్ళలో ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.

  24. యెషయా 32:19సుమారు క్రీ.పూ. 713

    వడగండ్లు అడవిని నాశనం చేసినా పట్టణం పూర్తిగా నేలమట్టమైనా,

  25. యెషయా 32:20సుమారు క్రీ.పూ. 713

    మీరు ఎంతో ధన్యులై ఉంటారు, మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ, మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు.