కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 34:2సుమారు క్రీ.పూ. 713

    సమస్త దేశాల మీద యెహోవా కోపంగా ఉన్నారు; వారి సైన్యాలన్నిటి మీద ఆయన ఉగ్రత ఉంది. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తారు, వారిని వధకు అప్పగిస్తారు.

  2. యెషయా 34:3సుమారు క్రీ.పూ. 713

    వారిలో చంపబడినవారు పూడ్చిపెట్టబడరు, వారి శవాలు కంపుకొడతాయి. పర్వతాలు వారి రక్తంతో తడిసిపోతాయి.

  3. యెషయా 34:4సుమారు క్రీ.పూ. 713

    ఆకాశ నక్షత్రాలన్నీ కరిగిపోతాయి గ్రంథపుచుట్టలా ఆకాశాలు చుట్టబడతాయి; ద్రాక్షతీగె నుండి వాడిన ఆకు రాలినట్లుగా అంజూర చెట్టు నుండి వాడిన కాయ రాలినట్లుగా నక్షత్ర సైన్యమంతా రాలిపోతుంది.

  4. యెషయా 34:5సుమారు క్రీ.పూ. 713

    ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది; చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి, నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది.

  5. యెషయా 34:6సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.

  6. యెషయా 34:7సుమారు క్రీ.పూ. 713

    వాటితో పాటు అడవి ఎద్దులు, కోడెలు, బలమైన ఎద్దులు చస్తాయి. వారి భూమి రక్తంతో తడుస్తుంది. వారి మట్టి క్రొవ్వులో నానుతుంది.

  7. యెషయా 34:8సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.

  8. యెషయా 34:9సుమారు క్రీ.పూ. 713

    ఎదోము నీటిప్రవాహాలు కీలుగా దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది. దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది.

  9. యెషయా 34:10సుమారు క్రీ.పూ. 713

    అది రాత్రింబగళ్ళు ఆరిపోదు; దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది. అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది; దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు.

  10. యెషయా 34:11సుమారు క్రీ.పూ. 713

    గూడబాతులు, జీరగపిట్ట దానిని స్వాధీనం చేసుకుంటాయి; గుడ్లగూబ, కాకి దానిలో నివసిస్తాయి. దేవుడు తారుమారనే కొలమానాన్ని శూన్యమనే మట్టపు గుండును ఏదోముపై చాపుతారు.

  11. యెషయా 34:12సుమారు క్రీ.పూ. 713

    రాజ్యమని ప్రకటించడానికి వారి ఘనులకు అక్కడ ఏమీ మిగలదు, వారి అధిపతులందరు మాయమవుతారు.

  12. యెషయా 34:13సుమారు క్రీ.పూ. 713

    దాని కోటలలో ముళ్ళచెట్లు, దాని దుర్గాలలో దురదగొండ్లు గచ్చపొదలు పెరుగుతాయి. అది తోడేళ్లకు నివాసంగా గుడ్లగూబలకు ఇల్లుగా ఉంటుంది.

  13. యెషయా 34:14సుమారు క్రీ.పూ. 713

    ఎడారి జీవులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి అడవి మేకలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడతాయి; అక్కడ రాత్రివేళ తిరిగే ప్రాణులు కూడా పడుకుంటాయి అక్కడ అవి వాటికి విశ్రాంతి స్థలాలను కనుగొంటారు.

  14. యెషయా 34:15సుమారు క్రీ.పూ. 713

    అక్కడ గుడ్లగూబ గూడు కట్టి గుడ్లు పెట్టి, వాటిని పొదిగి, తన రెక్కల నీడలో వాటిని ఉంచి, దాని పిల్లలను పోషిస్తుంది. అక్కడ తెల్ల గద్దలు ప్రతి ఒక్కటి తమ జాతి పక్షులతో జతకడతాయి.

  15. యెషయా 34:16సుమారు క్రీ.పూ. 713

    యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి: వీటిలో ఏవి తప్పిపోవు, ఏ ఒక్కటి కూడా తన జత లేకుండా ఉండదు. ఎందుకంటే, ఆయన నోరే ఈ ఆదేశాన్ని ఇచ్చింది, ఆయన ఆత్మ వాటిని పోగుచేస్తారు.

  16. యెషయా 34:17సుమారు క్రీ.పూ. 713

    ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు; ఆయన చేతి కొలత ప్రకారం వాటికి పంచిపెడుతుంది. అవి శాశ్వతంగా దానిని స్వాధీనం చేసుకుంటాయి తరతరాలు అందులో నివసిస్తాయి.

  17. యెషయా 35:1సుమారు క్రీ.పూ. 713

    ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,

  18. యెషయా 35:2సుమారు క్రీ.పూ. 713

    ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.

  19. యెషయా 35:3సుమారు క్రీ.పూ. 713

    బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;

  20. యెషయా 35:4సుమారు క్రీ.పూ. 713

    భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”

  21. యెషయా 35:5సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి చెవిటి వారి చెవులు వినబడతాయి.

  22. యెషయా 35:6సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి ఎడారిలో కాలువలు పారతాయి.

  23. యెషయా 35:7సుమారు క్రీ.పూ. 713

    మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.

  24. యెషయా 35:8సుమారు క్రీ.పూ. 713

    అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.

  25. యెషయా 35:9సుమారు క్రీ.పూ. 713

    అక్కడ ఏ సింహం ఉండదు, ఏ క్రూర జంతువు ఉండదు; అవి అక్కడ కనబడవు. విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.