కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 33:1సుమారు క్రీ.పూ. 713

    నాశనం చేసేవాడా, ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! మోసం చేసేవాడా, ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే నీవు నాశనం చేయబడతావు; నీవు మోసగించడం ముగించిన తర్వాతే నీవు మోసగించబడతావు.

  2. యెషయా 33:2సుమారు క్రీ.పూ. 713

    యెహోవా! మమ్మల్ని కరుణించండి; మీ కోసం ఎదురుచూస్తున్నాము. ప్రతి ఉదయం మాకు బలంగా, శ్రమకాలంలో మాకు రక్షణగా ఉండండి.

  3. యెషయా 33:3సుమారు క్రీ.పూ. 713

    మీ సైన్యం యొక్క గొప్ప శబ్దాన్ని విని జనాంగాలు పారిపోతాయి. మీరు లేచినప్పుడు దేశాలు చెదిరిపోతాయి.

  4. యెషయా 33:4సుమారు క్రీ.పూ. 713

    దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది; మిడతల దండులా ప్రజలు దాని మీద పడతారు.

  5. యెషయా 33:5సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు.

  6. యెషయా 33:6సుమారు క్రీ.పూ. 713

    ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది, విస్తారమైన రక్షణ బుద్ధి జ్ఞానాలు ఇస్తారు. యెహోవా భయం ఈ సంపదకు మూలము.

  7. యెషయా 33:7సుమారు క్రీ.పూ. 713

    చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు; సమాధాన రాయబారులు ఎక్కువగా ఏడుస్తున్నారు.

  8. యెషయా 33:8సుమారు క్రీ.పూ. 713

    రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి దారుల్లో ప్రయాణికులు లేరు. ఒప్పందాన్ని మీరారు, పట్టణాలను అవమానపరిచారు, ఏ ఒక్కరూ గౌరవించబడరు.

  9. యెషయా 33:9సుమారు క్రీ.పూ. 713

    దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

  10. యెషయా 33:10సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను, ఇప్పుడు నేను ఘనపరచబడతాను; ఇప్పుడు నేను హెచ్చింపబడతాను

  11. యెషయా 33:11సుమారు క్రీ.పూ. 713

    మీరు పొట్టును గర్భం ధరించి గడ్డికి జన్మనిస్తారు; మీ ఊపిరి అగ్నిలా మిమ్మల్ని కాల్చివేస్తుంది.

  12. యెషయా 33:12సుమారు క్రీ.పూ. 713

    ప్రజలు కాలి బూడిద అవుతారు; వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.”

  13. యెషయా 33:13సుమారు క్రీ.పూ. 713

    దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి; దగ్గరగా ఉన్నవారలారా, నా బలాన్ని గుర్తించండి!

  14. యెషయా 33:14సుమారు క్రీ.పూ. 713

    సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”

  15. యెషయా 33:15సుమారు క్రీ.పూ. 713

    నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,

  16. యెషయా 33:16సుమారు క్రీ.పూ. 713

    వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.

  17. యెషయా 33:17సుమారు క్రీ.పూ. 713

    మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి.

  18. యెషయా 33:18సుమారు క్రీ.పూ. 713

    మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? గోపురాల అధికారి ఎక్కడ?”

  19. యెషయా 33:19సుమారు క్రీ.పూ. 713

    ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది.

  20. యెషయా 33:20సుమారు క్రీ.పూ. 713

    మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి; మీ కళ్లు యెరూషలేమును చూస్తాయి, అది ప్రశాంత నివాసంగా, కదలని గుడారంగా ఉంటుంది; దాని మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఏ ఒక్కటి తెగిపోదు.

  21. యెషయా 33:21సుమారు క్రీ.పూ. 713

    అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ నడువదు వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు.

  22. యెషయా 33:22సుమారు క్రీ.పూ. 713

    యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.

  23. యెషయా 33:23సుమారు క్రీ.పూ. 713

    నీ ఓడ త్రాళ్లు వదులయ్యాయి: ఓడ స్తంభం క్షేమంగా లేదు, తెరచాప విప్పబడలేదు. అప్పుడు విస్తారమైన దోపుడుసొమ్ము విభజించబడుతుంది, కుంటివారు కూడా దోపుడుసొమ్మును తీసుకెళ్తారు.

  24. యెషయా 33:24సుమారు క్రీ.పూ. 713

    సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు; దానిలో నివసించే ప్రజల పాపాలు క్షమించబడతాయి.

  25. యెషయా 34:1సుమారు క్రీ.పూ. 713

    దేశాల్లారా, నా దగ్గరకు వచ్చి వినండి; ప్రజలారా, మీరు శ్రద్ధగా వినండి! భూమి దానిలోని సమస్తం, లోకం, దాని నుండి వచ్చేవన్ని వినును గాక.