కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 30:13సుమారు క్రీ.పూ. 713

    ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.

  2. యెషయా 30:14సుమారు క్రీ.పూ. 713

    అది మట్టికుండలా పగిలిపోతుంది, కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది, పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.”

  3. యెషయా 30:15సుమారు క్రీ.పూ. 713

    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది కానీ మీకు ఇవేవి లభించవు.

  4. యెషయా 30:16సుమారు క్రీ.పూ. 713

    మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు! మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు. కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!

  5. యెషయా 30:17సుమారు క్రీ.పూ. 713

    పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”

  6. యెషయా 30:18సుమారు క్రీ.పూ. 713

    అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు; కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!

  7. యెషయా 30:19సుమారు క్రీ.పూ. 713

    యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు.

  8. యెషయా 30:20సుమారు క్రీ.పూ. 713

    ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు.

  9. యెషయా 30:21సుమారు క్రీ.పూ. 713

    మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు.

  10. యెషయా 30:22సుమారు క్రీ.పూ. 713

    అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.

  11. యెషయా 30:23సుమారు క్రీ.పూ. 713

    మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి.

  12. యెషయా 30:24సుమారు క్రీ.పూ. 713

    భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి.

  13. యెషయా 30:25సుమారు క్రీ.పూ. 713

    గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి.

  14. యెషయా 30:26సుమారు క్రీ.పూ. 713

    యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.

  15. యెషయా 30:27సుమారు క్రీ.పూ. 713

    చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.

  16. యెషయా 30:28సుమారు క్రీ.పూ. 713

    ఆయన ఊపిరి మెడ లోతు వరకు ప్రవహించే ధారలా ఉంది. ఆయన నాశనమనే జల్లెడలో దేశాలను గాలిస్తారు; దారి తప్పించే కళ్లెమును ప్రజల దవడలలో ఆయన అమర్చుతారు.

  17. యెషయా 30:29సుమారు క్రీ.పూ. 713

    రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా మీరు పాడతారు ఇశ్రాయేలుకు ఆశ్రయ కోటయైన యెహోవా పర్వతానికి పిల్లనగ్రోవి వాయిస్తూ వెళ్లే వారిలా మీ హృదయాలు సంతోషిస్తాయి.

  18. యెషయా 30:30సుమారు క్రీ.పూ. 713

    యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు, భయంకరమైన కోపంతో దహించే అగ్నితో మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు.

  19. యెషయా 30:31సుమారు క్రీ.పూ. 713

    యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది; తన దండంతో ఆయన వారిని మొత్తుతారు.

  20. యెషయా 30:32సుమారు క్రీ.పూ. 713

    యెహోవా తన శిక్షించే దండంతో అష్షూరు మీద వేసే ప్రతి దెబ్బ తంబుర సితారాల సంగీతంతో కలిసి ఉంటుంది. ఆయన తన చేయి ఆడించి యుద్ధం చేస్తారు.

  21. యెషయా 30:33సుమారు క్రీ.పూ. 713

    చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది; అది రాజు కోసం సిద్ధపరచబడింది. విస్తారమైన అగ్ని, చెక్కతో దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; యెహోవా ఊపిరి మండుతున్న గంధక ప్రవాహంలా దానిని రగిలిస్తుంది.

  22. యెషయా 31:1సుమారు క్రీ.పూ. 713

    ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.

  23. యెషయా 31:2సుమారు క్రీ.పూ. 713

    అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు; ఆయన తన మాట వెనుకకు తీసుకోరు. ఆయన దుష్టప్రజల మీద, కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.

  24. యెషయా 31:3సుమారు క్రీ.పూ. 713

    ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు; వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు. యెహోవా తన చేయి చాపగా సహయం చేసేవారు తడబడతారు, సహయం పొందేవారు పడతారు; వారందరు కలిసి నాశనమవుతారు.

  25. యెషయా 31:4సుమారు క్రీ.పూ. 713

    యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు.