కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 28:16సుమారు క్రీ.పూ. 725

    కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.

  2. యెషయా 28:17సుమారు క్రీ.పూ. 725

    నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.

  3. యెషయా 28:18సుమారు క్రీ.పూ. 725

    చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.

  4. యెషయా 28:19సుమారు క్రీ.పూ. 725

    అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది.

  5. యెషయా 28:20సుమారు క్రీ.పూ. 725

    పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.

  6. యెషయా 28:21సుమారు క్రీ.పూ. 725

    నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.

  7. యెషయా 28:22సుమారు క్రీ.పూ. 725

    ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.

  8. యెషయా 28:23సుమారు క్రీ.పూ. 725

    జాగ్రత్తగా నా మాట వినండి; నేను చెప్పేది శ్రద్ధగా వినండి.

  9. యెషయా 28:24సుమారు క్రీ.పూ. 725

    రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా? అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా?

  10. యెషయా 28:25సుమారు క్రీ.పూ. 725

    అతడు నేల చదును చేసిన తర్వాత సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా? గోధుమలను వాటి స్థలంలో నాటడా? యవలను వాటి చోట వేయడా? పొలం అంచుల్లో ధాన్యం నాటడా?

  11. యెషయా 28:26సుమారు క్రీ.పూ. 725

    అతని దేవుడు అతనికి నేర్పిస్తారు సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు.

  12. యెషయా 28:27సుమారు క్రీ.పూ. 725

    సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.

  13. యెషయా 28:28సుమారు క్రీ.పూ. 725

    రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు.

  14. యెషయా 28:29సుమారు క్రీ.పూ. 725

    ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు, ఆయన ఆలోచన అద్భుతం, ఆయన జ్ఞానం గొప్పది.

  15. యెషయా 29:1సుమారు క్రీ.పూ. 712

    అరీయేలుకు శ్రమ దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ! సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి పండుగలు క్రమంగా జరుగనివ్వండి.

  16. యెషయా 29:2సుమారు క్రీ.పూ. 712

    అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.

  17. యెషయా 29:3సుమారు క్రీ.పూ. 712

    నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను; గోపురాలతో నిన్ను చుట్టుముట్టి నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను.

  18. యెషయా 29:4సుమారు క్రీ.పూ. 712

    అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.

  19. యెషయా 29:5సుమారు క్రీ.పూ. 712

    కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది.

  20. యెషయా 29:6సుమారు క్రీ.పూ. 712

    ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.

  21. యెషయా 29:7సుమారు క్రీ.పూ. 712

    అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు ఒక కలలా ఉంటారు రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు.

  22. యెషయా 29:8సుమారు క్రీ.పూ. 712

    ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.

  23. యెషయా 29:9సుమారు క్రీ.పూ. 712

    నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి. మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి; ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి, మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి.

  24. యెషయా 29:10సుమారు క్రీ.పూ. 712

    యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు: మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు; మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.

  25. యెషయా 29:11సుమారు క్రీ.పూ. 712

    మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు.