కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 25:12సుమారు క్రీ.పూ. 712

    మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.

  2. యెషయా 26:1సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.

  3. యెషయా 26:2సుమారు క్రీ.పూ. 712

    నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి.

  4. యెషయా 26:3సుమారు క్రీ.పూ. 712

    మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.

  5. యెషయా 26:4సుమారు క్రీ.పూ. 712

    యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.

  6. యెషయా 26:5సుమారు క్రీ.పూ. 712

    ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.

  7. యెషయా 26:6సుమారు క్రీ.పూ. 712

    అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది.

  8. యెషయా 26:7సుమారు క్రీ.పూ. 712

    నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.

  9. యెషయా 26:8సుమారు క్రీ.పూ. 712

    అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.

  10. యెషయా 26:9సుమారు క్రీ.పూ. 712

    రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.

  11. యెషయా 26:10సుమారు క్రీ.పూ. 712

    కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.

  12. యెషయా 26:11సుమారు క్రీ.పూ. 712

    యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.

  13. యెషయా 26:12సుమారు క్రీ.పూ. 712

    యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.

  14. యెషయా 26:13సుమారు క్రీ.పూ. 712

    యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు, కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము.

  15. యెషయా 26:14సుమారు క్రీ.పూ. 712

    వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.

  16. యెషయా 26:15సుమారు క్రీ.పూ. 712

    యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; మీరు దేశాన్ని వృద్ధిచేశారు. మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.

  17. యెషయా 26:16సుమారు క్రీ.పూ. 712

    యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.

  18. యెషయా 26:17సుమారు క్రీ.పూ. 712

    గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.

  19. యెషయా 26:18సుమారు క్రీ.పూ. 712

    మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము. కాని గాలికి జన్మనిచ్చాము. మేము భూమికి రక్షణను తీసుకురాలేదు, ఈ లోక ప్రజలు పుట్టలేదు.

  20. యెషయా 26:19సుమారు క్రీ.పూ. 712

    కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; వారి శరీరాలు పైకి లేస్తాయి మట్టిలో నివసిస్తున్నవారు, మేల్కొని సంతోషించాలి. మీ మంచు ఉదయపు మంచు వంటిది; భూమి తన మృతులకు జన్మనిస్తుంది.

  21. యెషయా 26:20సుమారు క్రీ.పూ. 712

    నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి మీ వెనక తలుపులు వేసుకోండి; ఆయన ఉగ్రత పోయే వరకు కొంతకాలం మీరు దాక్కోండి.

  22. యెషయా 26:21సుమారు క్రీ.పూ. 712

    ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.

  23. యెషయా 27:1సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున యెహోవా భయంకరమైన, గొప్పదైన శక్తిగల తన ఖడ్గంతో లెవియాథన్ అనే ఎగిరే పాము, లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు. ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు.

  24. యెషయా 27:2సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి:

  25. యెషయా 27:3సుమారు క్రీ.పూ. 712

    యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.