- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 23:3సుమారు క్రీ.పూ. 715
గొప్ప జలాల మీద షీహోరు ధాన్యం వచ్చింది; నైలు ప్రాంతంలో పండిన పంట తూరుకు ఆదాయం ఇచ్చింది, అది దేశాలకు వాణిజ్య కేంద్రంగా మారింది.
- యెషయా 23:4సుమారు క్రీ.పూ. 715
సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, సముద్రం ఇలా మాట్లాడింది: “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”
- యెషయా 23:5సుమారు క్రీ.పూ. 715
వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు.
- యెషయా 23:6సుమారు క్రీ.పూ. 715
తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.
- యెషయా 23:7సుమారు క్రీ.పూ. 715
మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? పాతది, ప్రాచీన పట్టణం, దూరదేశంలో నివసించడానికి సుదూర ప్రయాణం చేసింది ఇదేనా?
- యెషయా 23:8సుమారు క్రీ.పూ. 715
తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?
- యెషయా 23:9సుమారు క్రీ.పూ. 715
తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.
- యెషయా 23:10సుమారు క్రీ.పూ. 715
తర్షీషు కుమారీ, నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టి నైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు.
- యెషయా 23:11సుమారు క్రీ.పూ. 715
యెహోవా సముద్రం మీద తన చేయి చాపి దాని రాజ్యాలు వణికేలా చేశారు. కనాను కోటలను నాశనం చేయడానికి ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.
- యెషయా 23:12సుమారు క్రీ.పూ. 715
ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, ఇకపై నీకు సంతోషం ఉండదు. “నీవు లేచి కుప్రకు వెళ్లు, అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”
- యెషయా 23:13సుమారు క్రీ.పూ. 715
బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.
- యెషయా 23:14సుమారు క్రీ.పూ. 715
తర్షీషు ఓడలారా, రోదించండి; మీ కోట నాశనమయ్యింది.
- యెషయా 23:15సుమారు క్రీ.పూ. 715
ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:
- యెషయా 23:16సుమారు క్రీ.పూ. 715
“మరవబడిన వేశ్యా, సితారా తీసుకుని పట్టణంలో తిరుగు; నీవు జ్ఞాపకం వచ్చేలా సితారా మంచిగా వాయిస్తూ చాలా పాటలు పాడు.”
- యెషయా 23:17సుమారు క్రీ.పూ. 715
డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది.
- యెషయా 23:18సుమారు క్రీ.పూ. 715
అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.
- యెషయా 24:1సుమారు క్రీ.పూ. 712
చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.
- యెషయా 24:2సుమారు క్రీ.పూ. 712
అందరికి ఒకేలా ఉంటుంది; ప్రజలకు కలిగినట్లే యాజకునికి, సేవకునికి కలిగినట్లే యజమానికి, సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి, కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి, అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.
- యెషయా 24:3సుమారు క్రీ.పూ. 712
భూమి పూర్తిగా పాడుచేయబడి పూర్తిగా దోచుకోబడుతుంది. యెహోవా ఈ మాట చెప్పారు.
- యెషయా 24:4సుమారు క్రీ.పూ. 712
భూమి ఎండిపోయి వాడిపోతుంది, లోకం క్షీణించి వాడిపోతుంది, ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.
- యెషయా 24:5సుమారు క్రీ.పూ. 712
భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది; వారు చట్టాలకు లోబడలేదు, వారు కట్టడలను ఉల్లంఘించారు వారు నిత్యనిబంధనను భంగం చేశారు.
- యెషయా 24:6సుమారు క్రీ.పూ. 712
కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది; దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి. కాబట్టి భూనివాసులు కాలిపోయారు కేవలం కొద్దిమంది మిగిలారు.
- యెషయా 24:7సుమారు క్రీ.పూ. 712
క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది; సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు.
- యెషయా 24:8సుమారు క్రీ.పూ. 712
ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి, కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయింది ఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది.
- యెషయా 24:9సుమారు క్రీ.పూ. 712
ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు; మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది.