- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 22:3సుమారు క్రీ.పూ. 712
నీ నాయకులందరు కలిసి పారిపోయారు; విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు. శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని, మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు.
- యెషయా 22:4సుమారు క్రీ.పూ. 712
అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.
- యెషయా 22:5సుమారు క్రీ.పూ. 712
దర్శనపు లోయలో సైన్యాల అధిపతియైన యెహోవా నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, గోడలు కూలిపోతాయి పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది.
- యెషయా 22:6సుమారు క్రీ.పూ. 712
ఏలాము రథసారధులతో గుర్రాలతో తన అంబులపొదిని నింపుకుంది. కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు.
- యెషయా 22:7సుమారు క్రీ.పూ. 712
కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి, గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
- యెషయా 22:8సుమారు క్రీ.పూ. 712
ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న ఆయుధాల వైపు చూశారు.
- యెషయా 22:9సుమారు క్రీ.పూ. 712
దావీదు పట్టణపు గోడలు చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు దిగువన ఉన్న కొలనులో మీరు నీటిని సమకూర్చారు.
- యెషయా 22:10సుమారు క్రీ.పూ. 712
మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు.
- యెషయా 22:11సుమారు క్రీ.పూ. 712
పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.
- యెషయా 22:12సుమారు క్రీ.పూ. 712
ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి తలలు గొరిగించుకోడానికి గోనెపట్ట కట్టుకోడానికి సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు.
- యెషయా 22:13సుమారు క్రీ.పూ. 712
కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి మనం తిని త్రాగుదాం” అని చెప్పి, పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, మీరు సంతోషించి ఉల్లసిస్తారు.
- యెషయా 22:14సుమారు క్రీ.పూ. 712
ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
- యెషయా 22:15సుమారు క్రీ.పూ. 712
సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు: “నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు:
- యెషయా 22:16సుమారు క్రీ.పూ. 712
నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?
- యెషయా 22:17సుమారు క్రీ.పూ. 712
“ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని, వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త!
- యెషయా 22:18సుమారు క్రీ.పూ. 712
ఆయన నిన్ను ఒక బంతిలా దొర్లించి విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తారు. అక్కడ నీవు చనిపోతావు, నీ గొప్ప రథాలు అక్కడే పడి ఉంటాయి; నీ యజమాని ఇంటికి అవమానాన్ని తెస్తావు.
- యెషయా 22:19సుమారు క్రీ.పూ. 712
నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ హోదా నుండి త్రోసివేయబడతావు.
- యెషయా 22:20సుమారు క్రీ.పూ. 712
“ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి,
- యెషయా 22:21సుమారు క్రీ.పూ. 712
నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు.
- యెషయా 22:22సుమారు క్రీ.పూ. 712
నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు.
- యెషయా 22:23సుమారు క్రీ.పూ. 712
బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు.
- యెషయా 22:24సుమారు క్రీ.పూ. 712
చిన్న గిన్నెలను పాత్రలను మేకుకు వ్రేలాడదీసినట్టు అతని కుటుంబ ఘనతను అతనిపై వ్రేలాడి ఉంటుంది.
- యెషయా 22:25సుమారు క్రీ.పూ. 712
“సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట.
- యెషయా 23:1సుమారు క్రీ.పూ. 715
తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: తర్షీషు ఓడలారా! రోదించండి: తూరు నాశనమయ్యింది, అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. కుప్ర దేశం నుండి ఈ విషయం వారికి తెలియజేయబడింది.
- యెషయా 23:2సుమారు క్రీ.పూ. 715
సముద్ర తీర వాసులారా, సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి, సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు.