- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 24:10సుమారు క్రీ.పూ. 712
శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది; ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.
- యెషయా 24:11సుమారు క్రీ.పూ. 712
ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు; ఆనందమంతా దిగులుగా మారుతుంది, దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి.
- యెషయా 24:12సుమారు క్రీ.పూ. 712
పట్టణం శిథిలాల్లో ఉన్నది, దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది.
- యెషయా 24:13సుమారు క్రీ.పూ. 712
ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.
- యెషయా 24:14సుమారు క్రీ.పూ. 712
వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు; పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు.
- యెషయా 24:15సుమారు క్రీ.పూ. 712
కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
- యెషయా 24:16సుమారు క్రీ.పూ. 712
భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము: “నీతిమంతునికి ఘనత.” అయితే నేను అన్నాను, “నేను చెడిపోయాను, చెడిపోయాను! నాకు శ్రమ! మోసగాళ్ళు ద్రోహం చేస్తారు, మోసగాళ్ళు మోసంతో ద్రోహం చేస్తారు!”
- యెషయా 24:17సుమారు క్రీ.పూ. 712
భూలోక ప్రజలారా! మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి.
- యెషయా 24:18సుమారు క్రీ.పూ. 712
భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారో వారు గుంటలో పడతారు; ఎవరైతే గుంటలో నుండి పైకి వస్తారో, వారు ఉరిలో చిక్కుకుంటారు. ఆకాశపు తూములు తెరవబడ్డాయి భూమి పునాదులు కదిలాయి.
- యెషయా 24:19సుమారు క్రీ.పూ. 712
భూమి బద్దలై పోయింది, భూమి ముక్కలుగా చీలిపోయింది, భూమి భయంకరంగా అదురుతుంది.
- యెషయా 24:20సుమారు క్రీ.పూ. 712
భూమి త్రాగుబోతులా తూలుతుంది, గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది. దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది అది ఇక లేవనంతగా పడిపోతుంది.
- యెషయా 24:21సుమారు క్రీ.పూ. 712
ఆ రోజున యెహోవా పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.
- యెషయా 24:22సుమారు క్రీ.పూ. 712
చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె వారు చెరసాలలో వేయబడతారు. చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాత వారు శిక్షించబడతారు.
- యెషయా 24:23సుమారు క్రీ.పూ. 712
చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.
- యెషయా 25:1సుమారు క్రీ.పూ. 712
యెహోవా, మీరే నా దేవుడు; నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, పరిపూర్ణ నమ్మకత్వంతో మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన అద్భుతాలను మీరు చేశారు.
- యెషయా 25:2సుమారు క్రీ.పూ. 712
మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.
- యెషయా 25:3సుమారు క్రీ.పూ. 712
కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు; క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి.
- యెషయా 25:4సుమారు క్రీ.పూ. 712
మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు, అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు, తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా, వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు. ఎందుకంటే, క్రూరుల శ్వాస గోడకు తాకే తుఫానులా,
- యెషయా 25:5సుమారు క్రీ.పూ. 712
ఎడారి వేడిలా ఉంటుంది. మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు; మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లు క్రూరుల పాట నిలిపివేయబడుతుంది.
- యెషయా 25:6సుమారు క్రీ.పూ. 712
ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.
- యెషయా 25:7సుమారు క్రీ.పూ. 712
ఈ పర్వతంపై ఆయన ప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగును సమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు;
- యెషయా 25:8సుమారు క్రీ.పూ. 712
శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.
- యెషయా 25:9సుమారు క్రీ.పూ. 712
ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”
- యెషయా 25:10సుమారు క్రీ.పూ. 712
యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.
- యెషయా 25:11సుమారు క్రీ.పూ. 712
ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారి చేతులు యుక్తితో ఉన్నా దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.