కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 27:4సుమారు క్రీ.పూ. 712

    నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.

  2. యెషయా 27:5సుమారు క్రీ.పూ. 712

    ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి; వారు నాతో సమాధానపడాలి, అవును, వారు నాతో సమాధానపడాలి.”

  3. యెషయా 27:6సుమారు క్రీ.పూ. 712

    రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగురించి వికసించి లోకమంతటిని ఫలంతో నింపుతుంది.

  4. యెషయా 27:7సుమారు క్రీ.పూ. 712

    ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా?

  5. యెషయా 27:8సుమారు క్రీ.పూ. 712

    మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.

  6. యెషయా 27:9సుమారు క్రీ.పూ. 712

    ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని మిగిలి ఉండవు.

  7. యెషయా 27:10సుమారు క్రీ.పూ. 712

    బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.

  8. యెషయా 27:11సుమారు క్రీ.పూ. 712

    దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.

  9. యెషయా 27:12సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు.

  10. యెషయా 27:13సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.

  11. యెషయా 28:1సుమారు క్రీ.పూ. 725

    ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ.

  12. యెషయా 28:2సుమారు క్రీ.పూ. 725

    చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు. వడగండ్లు, తీవ్రమైన గాలులు కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు.

  13. యెషయా 28:3సుమారు క్రీ.పూ. 725

    ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం కాళ్లతో త్రొక్కబడుతుంది.

  14. యెషయా 28:4సుమారు క్రీ.పూ. 725

    ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు.

  15. యెషయా 28:5సుమారు క్రీ.పూ. 725

    ఆ రోజున సైన్యాల యెహోవా మిగిలిన తన ప్రజలకు తానే మహిమగల కిరీటంగా సుందరమైన పూల కిరీటంగా ఉంటారు.

  16. యెషయా 28:6సుమారు క్రీ.పూ. 725

    ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి వివేచన ఆత్మగా గుమ్మం దగ్గరే యుద్ధాన్ని త్రిప్పికొట్టేవారికి బలానికి మూలంగా ఉంటారు.

  17. యెషయా 28:7సుమారు క్రీ.పూ. 725

    అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు; మద్యం మత్తులో తడబడతారు దర్శనం వచ్చినప్పుడు తూలుతారు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు.

  18. యెషయా 28:8సుమారు క్రీ.పూ. 725

    వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి మురికి లేనిచోటు ఉండదు.

  19. యెషయా 28:9సుమారు క్రీ.పూ. 725

    “ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? తల్లి రొమ్ము విడిచిన వారికా, స్తన్యమును విడిచిన వారికా?

  20. యెషయా 28:10సుమారు క్రీ.పూ. 725

    ఇది చేయండి, అది చేయండి దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం; కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు.

  21. యెషయా 28:11సుమారు క్రీ.పూ. 725

    అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతారు.

  22. యెషయా 28:12సుమారు క్రీ.పూ. 725

    గతంలో ఆయన వారితో, “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇది నెమ్మది దొరికే స్థలం” అని చెప్పారు కాని వారు వినలేదు.

  23. యెషయా 28:13సుమారు క్రీ.పూ. 725

    కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది: ఇది చేయాలి, అది చేయాలి దీనికి ఆజ్ఞ, దానికి ఆజ్ఞ కొంత ఇక్కడ కొంత అక్కడ అప్పుడు వారు వెళ్తుండగా వెనుకకు పడతారు; వారు గాయపరచబడతారు, ఉచ్చులో పడతారు, పట్టబడతారు.

  24. యెషయా 28:14సుమారు క్రీ.పూ. 725

    కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి.

  25. యెషయా 28:15సుమారు క్రీ.పూ. 725

    “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.