కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 29:12సుమారు క్రీ.పూ. 712

    చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు.

  2. యెషయా 29:13సుమారు క్రీ.పూ. 712

    ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

  3. యెషయా 29:14సుమారు క్రీ.పూ. 712

    కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.”

  4. యెషయా 29:15సుమారు క్రీ.పూ. 712

    తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.

  5. యెషయా 29:16సుమారు క్రీ.పూ. 712

    మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?

  6. యెషయా 29:17సుమారు క్రీ.పూ. 712

    ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా?

  7. యెషయా 29:18సుమారు క్రీ.పూ. 712

    ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, చీకటిలో చిమ్మ చీకటిలో గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి.

  8. యెషయా 29:19సుమారు క్రీ.పూ. 712

    మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.

  9. యెషయా 29:20సుమారు క్రీ.పూ. 712

    దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు,

  10. యెషయా 29:21సుమారు క్రీ.పూ. 712

    ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు.

  11. యెషయా 29:22సుమారు క్రీ.పూ. 712

    కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: “ఇకపై యాకోబు సిగ్గుపడడు; ఇకపై వారి ముఖాలు చిన్నబోవు.

  12. యెషయా 29:23సుమారు క్రీ.పూ. 712

    వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.

  13. యెషయా 29:24సుమారు క్రీ.పూ. 712

    ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”

  14. యెషయా 30:1సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ఇలా అంటున్నారు, “మూర్ఖులైన పిల్లలకు శ్రమ, వారు నావి కాని ఆలోచనలు చేస్తారు, నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ పాపానికి పాపం జత చేస్తున్నారు;

  15. యెషయా 30:2సుమారు క్రీ.పూ. 713

    వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

  16. యెషయా 30:3సుమారు క్రీ.పూ. 713

    కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది, ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.

  17. యెషయా 30:4సుమారు క్రీ.పూ. 713

    వారి అధిపతులు సోయనులో ఉన్నా, వారి రాయబారులు హనేసు చేరుకున్నా

  18. యెషయా 30:5సుమారు క్రీ.పూ. 713

    వారికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే ప్రజల కారణంగా వారందరు సిగ్గుపరచబడతారు.”

  19. యెషయా 30:6సుమారు క్రీ.పూ. 713

    దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం: సింహాలు ఆడ సింహాలు, నాగుపాములు ఎగిరే సర్పాలు, కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు, గాడిదల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని తమకు లాభం కలిగించని ఆ దేశానికి,

  20. యెషయా 30:7సుమారు క్రీ.పూ. 713

    సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు. కాబట్టి నేను దానిని ఏమి చేయని రాహాబు అని పిలుస్తాను.

  21. యెషయా 30:8సుమారు క్రీ.పూ. 713

    ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన సాక్షంగా ఉండేలా వారి కోసం పలక మీద దీనిని వ్రాయి వీటిని గ్రంథస్తం చేయి.

  22. యెషయా 30:9సుమారు క్రీ.పూ. 713

    ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు, యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు.

  23. యెషయా 30:10సుమారు క్రీ.పూ. 713

    వారు దీర్ఘదర్శులతో, “ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు. అలాగే ప్రవక్తలతో, “సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు. మాకు అనుకూలమైన విషయాలు భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.

  24. యెషయా 30:11సుమారు క్రీ.పూ. 713

    మా దారిని వదలండి, ఈ మార్గం నుండి తొలగిపోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!”

  25. యెషయా 30:12సుమారు క్రీ.పూ. 713

    కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే: “మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు, బాధించడాన్ని నమ్ముకుని, మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,