కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 20:1సుమారు క్రీ.పూ. 714

    అష్షూరు రాజైన సర్గోను తన సైన్యాధిపతిని పంపిన సంవత్సరంలో అతడు అష్డోదుకు వచ్చి, దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.

  2. యెషయా 20:2సుమారు క్రీ.పూ. 714

    ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు.

  3. యెషయా 20:3సుమారు క్రీ.పూ. 714

    అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే

  4. యెషయా 20:4సుమారు క్రీ.పూ. 714

    అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు.

  5. యెషయా 20:5సుమారు క్రీ.పూ. 714

    కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు.

  6. యెషయా 20:6సుమారు క్రీ.పూ. 714

    ఆ రోజున ఆ తీరప్రాంతంలో నివసించేవారు, ‘అష్షూరు రాజు చేతిలో నుండి విడుదల, సహయం కోసం మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఏమి జరిగిందో చూడండి! ఇప్పుడు మనమెలా తప్పించుకోగలం?’ అని అంటారు.”

  7. యెషయా 21:1సుమారు క్రీ.పూ. 714

    సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.

  8. యెషయా 21:2సుమారు క్రీ.పూ. 714

    భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.

  9. యెషయా 21:3సుమారు క్రీ.పూ. 714

    కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.

  10. యెషయా 21:4సుమారు క్రీ.పూ. 714

    నా గుండె దడదడలాడుతుంది భయంతో వణుకు పుడుతుంది; నేను ఇష్టమైన సంధ్యవేళ నాకు భయం పుట్టించింది.

  11. యెషయా 21:5సుమారు క్రీ.పూ. 714

    వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.

  12. యెషయా 21:6సుమారు క్రీ.పూ. 714

    ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి.

  13. యెషయా 21:7సుమారు క్రీ.పూ. 714

    అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.”

  14. యెషయా 21:8సుమారు క్రీ.పూ. 714

    కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.

  15. యెషయా 21:9సుమారు క్రీ.పూ. 714

    చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”

  16. యెషయా 21:10సుమారు క్రీ.పూ. 714

    నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.

  17. యెషయా 21:11సుమారు క్రీ.పూ. 714

    దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”

  18. యెషయా 21:12సుమారు క్రీ.పూ. 714

    కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.

  19. యెషయా 21:13సుమారు క్రీ.పూ. 714

    అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: అరేబియా ఎడారిలో బసచేసే దెదానీయులైన యాత్రికులారా,

  20. యెషయా 21:14సుమారు క్రీ.పూ. 714

    మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి; తేమా దేశ నివాసులారా, పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి.

  21. యెషయా 21:15సుమారు క్రీ.పూ. 714

    ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి, ఎక్కుపెట్టిన బాణాల నుండి, తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు.

  22. యెషయా 21:16సుమారు క్రీ.పూ. 714

    ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది.

  23. యెషయా 21:17సుమారు క్రీ.పూ. 714

    కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.

  24. యెషయా 22:1సుమారు క్రీ.పూ. 712

    దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు?

  25. యెషయా 22:2సుమారు క్రీ.పూ. 712

    కల్లోలంతో నిండిన పట్టణమా! కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా! నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు. యుద్ధంలో మరణించలేదు.