- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 19:1సుమారు క్రీ.పూ. 714
ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం: చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి ఈజిప్టుకు వస్తున్నారు. ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి, ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.
- యెషయా 19:2సుమారు క్రీ.పూ. 714
“నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను, సోదరుని మీదికి సోదరుడు, పొరుగువారి మీదికి పొరుగువారు, పట్టణం మీదికి పట్టణం, రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.
- యెషయా 19:3సుమారు క్రీ.పూ. 714
ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు, వారి ఆలోచనలను నాశనం చేస్తాను; వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను, భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.
- యెషయా 19:4సుమారు క్రీ.పూ. 714
నేను ఈజిప్టువారిని క్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను, భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెషయా 19:5సుమారు క్రీ.పూ. 714
సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.
- యెషయా 19:6సుమారు క్రీ.పూ. 714
కాలువలు కంపుకొడతాయి; ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి. రెల్లు, గడ్డి వాడిపోతాయి,
- యెషయా 19:7సుమారు క్రీ.పూ. 714
నైలు నది ప్రాంతంలో దాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి, నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలం వాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు.
- యెషయా 19:8సుమారు క్రీ.పూ. 714
జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు, నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు; నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.
- యెషయా 19:9సుమారు క్రీ.పూ. 714
దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు, సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.
- యెషయా 19:10సుమారు క్రీ.పూ. 714
బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.
- యెషయా 19:11సుమారు క్రీ.పూ. 714
సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు; ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు. “నేను జ్ఞానులలో ఒకడిని, పూర్వపురాజుల శిష్యుడను” అని ఫరోతో మీరెలా చెప్తారు?
- యెషయా 19:12సుమారు క్రీ.పూ. 714
నీ జ్ఞానులు ఏమయ్యారు? సైన్యాల యెహోవా ఈజిప్టు గురించి నిర్ణయించిన దానిని వారు నీకు చూపించి, తెలియజేయనివ్వు.
- యెషయా 19:13సుమారు క్రీ.పూ. 714
సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.
- యెషయా 19:14సుమారు క్రీ.పూ. 714
యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.
- యెషయా 19:15సుమారు క్రీ.పూ. 714
తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.
- యెషయా 19:16సుమారు క్రీ.పూ. 714
ఆ రోజున ఈజిప్టువారు స్త్రీలలా బలహీనంగా అవుతారు. సైన్యాల యెహోవా వారిపై తన చేయి ఆడించడం చూసి వారు భయంతో వణికిపోతారు.
- యెషయా 19:17సుమారు క్రీ.పూ. 714
యూదా దేశం ఈజిప్టువారికి భయం కలిగిస్తుంది; తమకు వ్యతిరేకంగా సైన్యాల యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి యూదా గురించి విన్న ప్రతి ఒక్కరు భయపడతారు.
- యెషయా 19:18సుమారు క్రీ.పూ. 714
ఆ రోజున ఈజిప్టులో ఉండే అయిదు పట్టణాలు కనాను భాష మాట్లాడి, సైన్యాల యెహోవా వారమని ప్రమాణం చేస్తాయి. వాటిలో ఒకదాని పేరు సూర్యుని పట్టణము.
- యెషయా 19:19సుమారు క్రీ.పూ. 714
ఆ రోజున ఈజిప్టు దేశంలో మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం, దాని సరిహద్దులో యెహోవాకు ఒక స్మారక చిహ్నం ఉంటాయి.
- యెషయా 19:20సుమారు క్రీ.పూ. 714
అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు.
- యెషయా 19:21సుమారు క్రీ.పూ. 714
ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు.
- యెషయా 19:22సుమారు క్రీ.పూ. 714
యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు.
- యెషయా 19:23సుమారు క్రీ.పూ. 714
ఆ రోజున ఈజిప్టు నుండి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరీయులు ఈజిప్టుకు, ఈజిప్టువారు అష్షూరుకు వస్తూ పోతుంటారు. ఈజిప్టువారు అష్షూరీయులు కలిసి ఆరాధిస్తారు.
- యెషయా 19:24సుమారు క్రీ.పూ. 714
ఆ రోజున, ఈజిప్టు అష్షూరుతో పాటు ఇశ్రాయేలు మూడవదిగా ఉండి, భూమిపై ఆశీర్వాదంగా ఉంటుంది.
- యెషయా 19:25సుమారు క్రీ.పూ. 714
సైన్యాల యెహోవా, “నా ప్రజలైన ఈజిప్టు వారలారా, నా చేతి పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా! మీరు ఆశీర్వదింపబడతారు” అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు.