కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 16:11సుమారు క్రీ.పూ. 726

    నా హృదయం వీణలా మోయాబు గురించి, నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది.

  2. యెషయా 16:12సుమారు క్రీ.పూ. 726

    మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అది కేవలం ఆయాసపడుతుంది; ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు దానికి ఏమి దొరకదు.

  3. యెషయా 16:13సుమారు క్రీ.పూ. 726

    యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది.

  4. యెషయా 16:14సుమారు క్రీ.పూ. 726

    అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”

  5. యెషయా 17:1సుమారు క్రీ.పూ. 741

    దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం: “చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు, కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది.

  6. యెషయా 17:2సుమారు క్రీ.పూ. 741

    అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.

  7. యెషయా 17:3సుమారు క్రీ.పూ. 741

    ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది, దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది; ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు అరాములో మిగిలినవారికి జరుగుతుంది” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

  8. యెషయా 17:4సుమారు క్రీ.పూ. 741

    “ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది; అతని శరీరం యొక్క క్రొవ్వు తరిగిపోతుంది.

  9. యెషయా 17:5సుమారు క్రీ.పూ. 741

    అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది.

  10. యెషయా 17:6సుమారు క్రీ.పూ. 741

    అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.

  11. యెషయా 17:7సుమారు క్రీ.పూ. 741

    ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు.

  12. యెషయా 17:8సుమారు క్రీ.పూ. 741

    వారు తమ చేతుల పనియైన బలిపీఠాల వైపు చూడరు, తమ చేతివ్రేళ్లు చేసిన అషేరా స్తంభాలను ధూపవేదికలను పట్టించుకోరు.

  13. యెషయా 17:9సుమారు క్రీ.పూ. 741

    ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి.

  14. యెషయా 17:10సుమారు క్రీ.పూ. 741

    నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,

  15. యెషయా 17:11సుమారు క్రీ.పూ. 741

    నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా, ఉదయాన నీవు వేసిన విత్తనాలు పూలు పూచేలా నీవు చేసినా, రోగం, తీరని దుఃఖం కలిగే రోజున పంట ఏమి లేనట్లుగా ఉంటుంది.

  16. యెషయా 17:12సుమారు క్రీ.పూ. 741

    ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ వారు హోరెత్తిన సముద్రంలా ఘోషిస్తున్నారు! గర్జిస్తున్న ప్రజలకు శ్రమ వారు గొప్ప నీటి ప్రవాహాల్లా గర్జిస్తున్నారు!

  17. యెషయా 17:13సుమారు క్రీ.పూ. 741

    ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు. కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు, సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు.

  18. యెషయా 17:14సుమారు క్రీ.పూ. 741

    సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.

  19. యెషయా 18:1సుమారు క్రీ.పూ. 714

    కూషు నదుల అవతల సందడి చేసే రెక్కల దేశమా, నీకు శ్రమ!

  20. యెషయా 18:2సుమారు క్రీ.పూ. 714

    అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి.

  21. యెషయా 18:3సుమారు క్రీ.పూ. 714

    సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు.

  22. యెషయా 18:4సుమారు క్రీ.పూ. 714

    యెహోవా నాతో చెప్పే మాట ఇది: “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.”

  23. యెషయా 18:5సుమారు క్రీ.పూ. 714

    కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడు పువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడు ఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించి విస్తరించే తీగెలను తీసివేస్తారు.

  24. యెషయా 18:6సుమారు క్రీ.పూ. 714

    అవి పర్వత పక్షులకు, భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి; వాటిని వేసవి కాలమంతా పక్షులు, శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.

  25. యెషయా 18:7సుమారు క్రీ.పూ. 714

    ఆ కాలంలో ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు దూరంలోనున్న భయపెట్టే ప్రజలు నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.