- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యోవేలు 2:28సుమారు క్రీ.పూ. 800
“ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.
- యోవేలు 2:29సుమారు క్రీ.పూ. 800
ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను.
- యోవేలు 2:30సుమారు క్రీ.పూ. 800
నేను ఆకాశంలో అద్భుతాలను, భూమి మీద రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.
- యోవేలు 2:31సుమారు క్రీ.పూ. 800
యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.
- యోవేలు 2:32సుమారు క్రీ.పూ. 800
యెహోవా పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు; యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద, యెరూషలేములో విడుదల ఉంటుంది, ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో, వారు రక్షింపబడతారు.
- యోవేలు 3:1సుమారు క్రీ.పూ. 800
“ఆ దినాల్లో ఆ కాలంలో, నేను యూదా, యెరూషలేము వారిని తిరిగి రప్పించినప్పుడు,
- యోవేలు 3:2సుమారు క్రీ.పూ. 800
నేను దేశాలన్నిటిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోకి నడిపిస్తాను. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు వారు చేసిన దానిని బట్టి, అక్కడ వారికి న్యాయ విచారణ జరిగిస్తాను, ఎందుకంటే వారు నా ప్రజలను దేశాల్లో చెదరగొట్టారు నా దేశాన్ని విభజించారు.
- యోవేలు 3:3సుమారు క్రీ.పూ. 800
వారు నా ప్రజల కోసం చీట్లు వేసి అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు. అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.
- యోవేలు 3:4సుమారు క్రీ.పూ. 800
“తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.
- యోవేలు 3:5సుమారు క్రీ.పూ. 800
ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.
- యోవేలు 3:6సుమారు క్రీ.పూ. 800
యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు అమ్మివేశారు.
- యోవేలు 3:7సుమారు క్రీ.పూ. 800
“చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.
- యోవేలు 3:8సుమారు క్రీ.పూ. 800
నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.
- యోవేలు 3:9సుమారు క్రీ.పూ. 800
దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.
- యోవేలు 3:10సుమారు క్రీ.పూ. 800
మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి.
- యోవేలు 3:11సుమారు క్రీ.పూ. 800
ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!
- యోవేలు 3:12సుమారు క్రీ.పూ. 800
“దేశాలు లేవాలి; అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి నలుదిశల ఉన్న అన్ని దేశాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
- యోవేలు 3:13సుమారు క్రీ.పూ. 800
పంట పండింది కాబట్టి, కొడవలి తిప్పండి, ద్రాక్షగానుగ నిండింది తొట్లు పొర్లి పారుతున్నాయి కాబట్టి రండి, ద్రాక్షలను త్రొక్కండి, వారి దుష్టత్వం అధికంగా ఉంది!”
- యోవేలు 3:14సుమారు క్రీ.పూ. 800
తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.
- యోవేలు 3:15సుమారు క్రీ.పూ. 800
సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
- యోవేలు 3:16సుమారు క్రీ.పూ. 800
యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.
- యోవేలు 3:17సుమారు క్రీ.పూ. 800
“అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.
- యోవేలు 3:18సుమారు క్రీ.పూ. 800
“ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది, కొండల నుండి పాలు ప్రవహిస్తాయి; యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి. యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ, షిత్తీము లోయను తడుపుతుంది.
- యోవేలు 3:19సుమారు క్రీ.పూ. 800
అయితే ఈజిప్టు పాడైపోతుంది, ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది. ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి, వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.
- యోవేలు 3:20సుమారు క్రీ.పూ. 800
యూదాలో ప్రజలు నిత్యం నివసిస్తారు, యెరూషలేము తరతరాలకు నివాస స్థలంగా ఉంటుంది.