- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- ఆమోసు 2:10సుమారు క్రీ.పూ. 787
అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను.
- ఆమోసు 2:11సుమారు క్రీ.పూ. 787
“అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- ఆమోసు 2:12సుమారు క్రీ.పూ. 787
“అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు.
- ఆమోసు 2:13సుమారు క్రీ.పూ. 787
“కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను.
- ఆమోసు 2:14సుమారు క్రీ.పూ. 787
వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు.
- ఆమోసు 2:15సుమారు క్రీ.పూ. 787
విలుకాడు నిలబడలేడు, బాగా పరుగెత్తగల సైనికుడు తప్పించుకోలేడు, గుర్రపురౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
- ఆమోసు 2:16సుమారు క్రీ.పూ. 787
ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా దిగంబరులై పారిపోతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- ఆమోసు 3:1సుమారు క్రీ.పూ. 787
ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:
- ఆమోసు 3:2సుమారు క్రీ.పూ. 787
“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
- ఆమోసు 3:3సుమారు క్రీ.పూ. 787
పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా?
- ఆమోసు 3:4సుమారు క్రీ.పూ. 787
ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా?
- ఆమోసు 3:5సుమారు క్రీ.పూ. 787
నేల మీద ఎరపెట్టనిదే, పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే, ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా?
- ఆమోసు 3:6సుమారు క్రీ.పూ. 787
పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?
- ఆమోసు 3:7సుమారు క్రీ.పూ. 787
తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
- ఆమోసు 3:8సుమారు క్రీ.పూ. 787
సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
- ఆమోసు 3:9సుమారు క్రీ.పూ. 787
అష్డోదు కోటలకు ఇలా చాటించండి, ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి: “సమరయ పర్వతాలమీద కూడుకోండి; దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని, దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.”
- ఆమోసు 3:10సుమారు క్రీ.పూ. 787
“సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”
- ఆమోసు 3:11సుమారు క్రీ.పూ. 787
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, మీ దుర్గాలను పడగొడతాడు, మీ కోటలను దోచుకుంటాడు.”
- ఆమోసు 3:12సుమారు క్రీ.పూ. 787
యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”
- ఆమోసు 3:13సుమారు క్రీ.పూ. 787
“దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు.
- ఆమోసు 3:14సుమారు క్రీ.పూ. 787
“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.
- ఆమోసు 3:15సుమారు క్రీ.పూ. 787
చలికాలపు విడిది భవనాన్ని, ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను; ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయి గొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,” అని యెహోవా చెప్తున్నారు.
- ఆమోసు 4:1సుమారు క్రీ.పూ. 787
సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.
- ఆమోసు 4:2సుమారు క్రీ.పూ. 787
ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది.
- ఆమోసు 4:3సుమారు క్రీ.పూ. 787
మీరంతా ప్రాకారాలలో పగుళ్ళ గుండా తిన్నగా పోతారు. మీరు హర్మోను వైపుకు పారవేయబడతారు,” అని యెహోవా చెప్తున్నారు.