- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- ఆమోసు 5:16సుమారు క్రీ.పూ. 787
కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.
- ఆమోసు 5:17సుమారు క్రీ.పూ. 787
ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” అని యెహోవా అంటున్నారు.
- ఆమోసు 5:18సుమారు క్రీ.పూ. 787
యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది.
- ఆమోసు 5:19సుమారు క్రీ.పూ. 787
అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది.
- ఆమోసు 5:20సుమారు క్రీ.పూ. 787
యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా?
- ఆమోసు 5:21సుమారు క్రీ.పూ. 787
“మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.
- ఆమోసు 5:22సుమారు క్రీ.పూ. 787
మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.
- ఆమోసు 5:23సుమారు క్రీ.పూ. 787
మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.
- ఆమోసు 5:24సుమారు క్రీ.పూ. 787
అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.
- ఆమోసు 5:25సుమారు క్రీ.పూ. 787
“ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?
- ఆమోసు 5:26సుమారు క్రీ.పూ. 787
మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.
- ఆమోసు 5:27సుమారు క్రీ.పూ. 787
కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.
- ఆమోసు 6:1సుమారు క్రీ.పూ. 787
సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!
- ఆమోసు 6:2సుమారు క్రీ.పూ. 787
మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా?
- ఆమోసు 6:3సుమారు క్రీ.పూ. 787
ఆపద్దినం దూరంగా ఉందనుకుని, దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.
- ఆమోసు 6:4సుమారు క్రీ.పూ. 787
మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.
- ఆమోసు 6:5సుమారు క్రీ.పూ. 787
మీరు దావీదులా సితారా వాయిస్తూ వాయిద్యాలు మెరుగుపరుస్తారు.
- ఆమోసు 6:6సుమారు క్రీ.పూ. 787
మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.
- ఆమోసు 6:7సుమారు క్రీ.పూ. 787
కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు; మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి.
- ఆమోసు 6:8సుమారు క్రీ.పూ. 787
ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.”
- ఆమోసు 6:9సుమారు క్రీ.పూ. 787
ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా,
- ఆమోసు 6:10సుమారు క్రీ.పూ. 787
ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు.
- ఆమోసు 6:11సుమారు క్రీ.పూ. 787
ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.
- ఆమోసు 6:12సుమారు క్రీ.పూ. 787
గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.
- ఆమోసు 6:13సుమారు క్రీ.పూ. 787
లో దెబారును జయించి ఆనందిస్తున్న మీరు, “మా సొంత బలంతోనే కర్నాయీమును పట్టుకోలేదా?” అంటారు.