కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆమోసు 8:8సుమారు క్రీ.పూ. 787

    “ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

  2. ఆమోసు 8:9సుమారు క్రీ.పూ. 787

    “ఆ రోజున,” అంటూ ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా, పట్ట పగటివేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను.

  3. ఆమోసు 8:10సుమారు క్రీ.పూ. 787

    నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.

  4. ఆమోసు 8:11సుమారు క్రీ.పూ. 787

    ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను.

  5. ఆమోసు 8:12సుమారు క్రీ.పూ. 787

    ప్రజలు యెహోవా వాక్కు కోసం వెతుకుతూ, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, ఉత్తర దిక్కునుండి తూర్పుదిక్కు వరకు తిరుగుతారు కాని అది వారికి దొరకదు.

  6. ఆమోసు 8:13సుమారు క్రీ.పూ. 787

    “ఆ రోజున “అందమైన కన్యలు బలమైన యువకులు దప్పికతో మూర్ఛపోతారు.

  7. ఆమోసు 8:14సుమారు క్రీ.పూ. 787

    సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”

  8. ఆమోసు 9:1సుమారు క్రీ.పూ. 787

    బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.

  9. ఆమోసు 9:2సుమారు క్రీ.పూ. 787

    వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను.

  10. ఆమోసు 9:3సుమారు క్రీ.పూ. 787

    వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.

  11. ఆమోసు 9:4సుమారు క్రీ.పూ. 787

    శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. “నా చూపు వారి మీద నిలుపుతాను, అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.”

  12. ఆమోసు 9:5సుమారు క్రీ.పూ. 787

    సైన్యాల అధిపతియైన యెహోవా ఆయన భూమిని ముట్టగా అది కరిగిపోతుంది, భూనివాసులు అందరు విలపిస్తారు; దేశమంతా నైలు నదిలా పొంగుతుంది, ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

  13. ఆమోసు 9:6సుమారు క్రీ.పూ. 787

    ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు, దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు. ఆయన సముద్రం నీటిని పిలిపించి భూమి మీద కుమ్మరిస్తారు, ఆయన పేరు యెహోవా.

  14. ఆమోసు 9:7సుమారు క్రీ.పూ. 787

    “ఇశ్రాయేలీయులైన మీరు నా దృష్టికి కూషు దేశస్థులతో సమానం కారా?” అని యెహోవా అంటున్నారు. “నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి, ఫిలిష్తీయులను కఫ్తోరు నుండి, అరామీయులను కీరు నుండి తీసుకురాలేదా?

  15. ఆమోసు 9:8సుమారు క్రీ.పూ. 787

    “నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. నేను దాన్ని భూమి మీద ఉండకుండ నాశనం చేస్తాను. అయినా యాకోబు సంతానాన్ని సంపూర్ణంగా నాశనం చేయను,” అని యెహోవా అంటున్నారు.

  16. ఆమోసు 9:9సుమారు క్రీ.పూ. 787

    “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను.

  17. ఆమోసు 9:10సుమారు క్రీ.పూ. 787

    నా ప్రజల్లోని పాపులందరు ‘విపత్తు మనల్ని తరమదు, మన మీదికి రాదు’ అని అనుకునే వారందరు, ఖడ్గానికి గురై చస్తారు.

  18. ఆమోసు 9:11సుమారు క్రీ.పూ. 787

    “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

  19. ఆమోసు 9:12సుమారు క్రీ.పూ. 787

    అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

  20. ఆమోసు 9:13సుమారు క్రీ.పూ. 787

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.

  21. ఆమోసు 9:14సుమారు క్రీ.పూ. 787

    నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను. “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.

  22. ఆమోసు 9:15సుమారు క్రీ.పూ. 787

    నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

  23. ఓబద్యా 1:1సుమారు క్రీ.పూ. 587

    ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.

  24. ఓబద్యా 1:2సుమారు క్రీ.పూ. 587

    “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు.

  25. ఓబద్యా 1:3సుమారు క్రీ.పూ. 587

    నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు.