కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోవేలు 2:3సుమారు క్రీ.పూ. 800

    వాటి ముందు అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి. అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది, అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది ఏదీ వాటినుండి తప్పించుకోలేదు.

  2. యోవేలు 2:4సుమారు క్రీ.పూ. 800

    అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి.

  3. యోవేలు 2:5సుమారు క్రీ.పూ. 800

    రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి,

  4. యోవేలు 2:6సుమారు క్రీ.పూ. 800

    వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.

  5. యోవేలు 2:7సుమారు క్రీ.పూ. 800

    అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి, సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి. అవి అటూ ఇటూ తిరుగకుండా, తిన్నగా నడుస్తున్నాయి.

  6. యోవేలు 2:8సుమారు క్రీ.పూ. 800

    ఒక దానినొకటి త్రోసుకోకుండా, అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి. వాటికి ఆయుధాలు ఎదురుపడినా, అవి వరుస మాత్రం తప్పవు.

  7. యోవేలు 2:9సుమారు క్రీ.పూ. 800

    అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి. గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి. దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు, అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి.

  8. యోవేలు 2:10సుమారు క్రీ.పూ. 800

    వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు.

  9. యోవేలు 2:11సుమారు క్రీ.పూ. 800

    యెహోవా తన సైన్యాన్ని నడిపిస్తూ ఉరుములా గర్జిస్తారు; ఆయన బలగాలు లెక్కకు మించినవి, ఆయన ఆజ్ఞకు లోబడే సైన్యం గొప్పది, యెహోవా దినం గొప్పది; అది భయంకరమైనది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?

  10. యోవేలు 2:12సుమారు క్రీ.పూ. 800

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.”

  11. యోవేలు 2:13సుమారు క్రీ.పూ. 800

    మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.

  12. యోవేలు 2:14సుమారు క్రీ.పూ. 800

    ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు?

  13. యోవేలు 2:15సుమారు క్రీ.పూ. 800

    సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి.

  14. యోవేలు 2:16సుమారు క్రీ.పూ. 800

    ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి.

  15. యోవేలు 2:17సుమారు క్రీ.పూ. 800

    యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”

  16. యోవేలు 2:18సుమారు క్రీ.పూ. 800

    అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి, ప్రజలను కనికరించారు.

  17. యోవేలు 2:19సుమారు క్రీ.పూ. 800

    యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.

  18. యోవేలు 2:20సుమారు క్రీ.పూ. 800

    “నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!

  19. యోవేలు 2:21సుమారు క్రీ.పూ. 800

    యూదా దేశమా, భయపడకు; సంతోషించు, ఆనందించు. నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు!

  20. యోవేలు 2:22సుమారు క్రీ.పూ. 800

    అడవి జంతువులారా, భయపడకండి, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి. చెట్లు తమ ఫలాలు ఇస్తాయి. అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.

  21. యోవేలు 2:23సుమారు క్రీ.పూ. 800

    సీయోను ప్రజలారా, సంతోషించండి, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, ఆయన నమ్మదగినవారు కాబట్టి, ఆయన మీకు తొలకరి వర్షం ఇచ్చారు. ఆయన సమృద్ధి వర్షాలు పంపిస్తారు, ఆయన ముందు పంపినట్లు తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తారు.

  22. యోవేలు 2:24సుమారు క్రీ.పూ. 800

    నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.

  23. యోవేలు 2:25సుమారు క్రీ.పూ. 800

    “నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతలు, మిడతల గుంపులు తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.

  24. యోవేలు 2:26సుమారు క్రీ.పూ. 800

    మీరు కడుపునిండా తిని తృప్తి పొందేవరకు మీకు సమృద్ధి ఉంటుంది, మీ కోసం అద్భుతాలు చేసిన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు స్తుతిస్తారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.

  25. యోవేలు 2:27సుమారు క్రీ.పూ. 800

    అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని, నేను మీ దేవుడైన యెహోవానని, వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.