కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హోషేయ 14:7సుమారు క్రీ.పూ. 725

    అతని నీడలో ప్రజలు నివసిస్తారు; వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, వారు ద్రాక్షలా వికసిస్తారు, ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది.

  2. హోషేయ 14:8సుమారు క్రీ.పూ. 725

    ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”

  3. హోషేయ 14:9సుమారు క్రీ.పూ. 725

    జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి. యెహోవా మార్గాలు సరియైనవి; నీతిమంతులు వాటిలో నడుస్తారు, కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.

  4. యోవేలు 1:1సుమారు క్రీ.పూ. 800

    ఇది పెతూయేలు కుమారుడైన యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.

  5. యోవేలు 1:2సుమారు క్రీ.పూ. 800

    పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?

  6. యోవేలు 1:3సుమారు క్రీ.పూ. 800

    ఈ సంగతి మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు తమ పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలు రాబోయే తరం వారికి చెప్పాలి.

  7. యోవేలు 1:4సుమారు క్రీ.పూ. 800

    మిడతల గుంపు విడిచిపెట్టిన దానిని పెద్ద మిడతలు తినేశాయి; పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానిని చిన్న మిడతలు తినేశాయి; చిన్న మిడతలు విడిచిపెట్టిన దానిని ఇతర మిడతలు తినేశాయి.

  8. యోవేలు 1:5సుమారు క్రీ.పూ. 800

    త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి! ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి; క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి, ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.

  9. యోవేలు 1:6సుమారు క్రీ.పూ. 800

    లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం, నా దేశాన్ని ఆక్రమించింది; దానికి సింహం పళ్లు ఉన్నాయి ఆడసింహం కోరలు ఉన్నాయి.

  10. యోవేలు 1:7సుమారు క్రీ.పూ. 800

    అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది నా అంజూర చెట్లను నాశనం చేసింది. అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు, చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.

  11. యోవేలు 1:8సుమారు క్రీ.పూ. 800

    తన యవ్వన భర్తను కోల్పోయి గోనెపట్ట కట్టుకుని, దుఃఖించే కన్యలా దుఃఖించండి.

  12. యోవేలు 1:9సుమారు క్రీ.పూ. 800

    భోజనార్పణలు పానార్పణలు యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి. యెహోవ ఎదుట సేవచేసే యాజకులు శోకంలో ఉన్నారు.

  13. యోవేలు 1:10సుమారు క్రీ.పూ. 800

    పొలాలు పాడయ్యాయి, నేల ఎండిపోయింది; ధాన్యం నాశనమైంది, క్రొత్త ద్రాక్షరసం ఎండిపోయింది, ఒలీవనూనె అయిపోయింది.

  14. యోవేలు 1:11సుమారు క్రీ.పూ. 800

    రైతులారా, నిరాశ చెందండి, ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి, గోధుమ, యవల కోసం దుఃఖించండి, ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.

  15. యోవేలు 1:12సుమారు క్రీ.పూ. 800

    ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.

  16. యోవేలు 1:13సుమారు క్రీ.పూ. 800

    యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.

  17. యోవేలు 1:14సుమారు క్రీ.పూ. 800

    పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి; పరిశుద్ధ సభను నిర్వహించండి. మీ దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి, యెహోవాకు మొరపెట్టడానికి పెద్దలను పిలిపించండి, దేశవాసులందరిని పిలిపించండి.

  18. యోవేలు 1:15సుమారు క్రీ.పూ. 800

    యెహోవా దినం దగ్గరపడింది; అయ్యో! ఆ దినం నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.

  19. యోవేలు 1:16సుమారు క్రీ.పూ. 800

    మన కళ్లెదుటే దేవుని మందిరంలో ఆహారం నిలిపివేయబడలేదా సంతోషం ఆనందం నిలిచిపోలేదా?

  20. యోవేలు 1:17సుమారు క్రీ.పూ. 800

    విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి. ధాన్యం ఎండిపోవడంతో, గిడ్డంగులు పాడైపోయాయి ధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.

  21. యోవేలు 1:18సుమారు క్రీ.పూ. 800

    తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.

  22. యోవేలు 1:19సుమారు క్రీ.పూ. 800

    యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.

  23. యోవేలు 1:20సుమారు క్రీ.పూ. 800

    కాలువలు ఎండిపోయాయి; అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.

  24. యోవేలు 2:1సుమారు క్రీ.పూ. 800

    సీయోనులో బూర ఊదండి; నా పరిశుద్ధ పర్వతం మీద నినాదాలు చేయండి. యెహోవా దినం రాబోతుంది కాబట్టి, దేశ నివాసులంతా వణకాలి, ఆ దినం సమీపంగా ఉంది.

  25. యోవేలు 2:2సుమారు క్రీ.పూ. 800

    అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.