- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- హోషేయ 12:12సుమారు క్రీ.పూ. 725
యాకోబు అరాము దేశానికి పారిపోయాడు; ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు, భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు.
- హోషేయ 12:13సుమారు క్రీ.పూ. 725
యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు.
- హోషేయ 12:14సుమారు క్రీ.పూ. 725
కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.
- హోషేయ 13:1సుమారు క్రీ.పూ. 725
ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.
- హోషేయ 13:2సుమారు క్రీ.పూ. 725
ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు; వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు, అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు, అవన్నీ కళాకారుని చేతిపనులు. ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు, “వారు నరబలులు అర్పిస్తారు! దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”
- హోషేయ 13:3సుమారు క్రీ.పూ. 725
కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.
- హోషేయ 13:4సుమారు క్రీ.పూ. 725
“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు, నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.
- హోషేయ 13:5సుమారు క్రీ.పూ. 725
మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని సంరక్షించాను.
- హోషేయ 13:6సుమారు క్రీ.పూ. 725
నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు. వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి; నన్ను మరచిపోయారు.
- హోషేయ 13:7సుమారు క్రీ.పూ. 725
కాబట్టి నేను వారికి సింహంలా ఉంటాను, చిరుతపులిలా దారిలో పొంచి ఉంటాను.
- హోషేయ 13:8సుమారు క్రీ.పూ. 725
పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; సింహంలా వారిని మ్రింగివేస్తాను, అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.
- హోషేయ 13:9సుమారు క్రీ.పూ. 725
“ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు.
- హోషేయ 13:10సుమారు క్రీ.పూ. 725
నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా? మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా? వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’ అని నీవు అడిగావు కదా?
- హోషేయ 13:11సుమారు క్రీ.పూ. 725
కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను. నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.
- హోషేయ 13:12సుమారు క్రీ.పూ. 725
ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి.
- హోషేయ 13:13సుమారు క్రీ.పూ. 725
ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది, కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు; గర్భం నుండి బయటకు రాని శిశువులా అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు.
- హోషేయ 13:14సుమారు క్రీ.పూ. 725
“నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,
- హోషేయ 13:15సుమారు క్రీ.పూ. 725
నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.
- హోషేయ 13:16సుమారు క్రీ.పూ. 725
సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”
- హోషేయ 14:1సుమారు క్రీ.పూ. 725
ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!
- హోషేయ 14:2సుమారు క్రీ.పూ. 725
మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము.
- హోషేయ 14:3సుమారు క్రీ.పూ. 725
అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”
- హోషేయ 14:4సుమారు క్రీ.పూ. 725
“నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను, మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను, ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది.
- హోషేయ 14:5సుమారు క్రీ.పూ. 725
నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;
- హోషేయ 14:6సుమారు క్రీ.పూ. 725
అతని చిగురు పెరుగుతుంది. అతని వైభవం ఒలీవ చెట్టులా, అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది.