కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హోషేయ 9:6సుమారు క్రీ.పూ. 760

    వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, ఈజిప్టువారిని సమకూరుస్తుంది, మెంఫిసు వారిని పాతిపెడుతుంది. వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.

  2. హోషేయ 9:7సుమారు క్రీ.పూ. 760

    శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.

  3. హోషేయ 9:8సుమారు క్రీ.పూ. 760

    నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.

  4. హోషేయ 9:9సుమారు క్రీ.పూ. 760

    గిబియా రోజుల్లో ఉన్నట్లు, వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.

  5. హోషేయ 9:10సుమారు క్రీ.పూ. 760

    “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు.

  6. హోషేయ 9:11సుమారు క్రీ.పూ. 760

    ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.

  7. హోషేయ 9:12సుమారు క్రీ.పూ. 760

    వారు పిల్లలను పెంచినా సరే, నేను వారికి మనుష్యులందరిని దూరం చేస్తాను. నేను వారిని విడిచిపెట్టినప్పుడు, వారికి శ్రమ!

  8. హోషేయ 9:13సుమారు క్రీ.పూ. 760

    నేను ఎఫ్రాయిమును, అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. కాని ఎఫ్రాయిం తన పిల్లలను, వధించే వాని దగ్గరకు తెస్తుంది.”

  9. హోషేయ 9:14సుమారు క్రీ.పూ. 760

    యెహోవా, వారికి ఇవ్వండి, వారికి మీరేమి ఇస్తారు, జన్మనివ్వలేని గర్భాలను, ఎండిపోయిన రొమ్ములను వారికి ఇవ్వండి.

  10. హోషేయ 9:15సుమారు క్రీ.పూ. 760

    “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. వారు పాప క్రియలనుబట్టి, నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.

  11. హోషేయ 9:16సుమారు క్రీ.పూ. 760

    ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, వారి వేరు ఎండిపోయింది, వారు ఇక ఫలించరు. ఒకవేళ వారు పిల్లలు కన్నా, వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”

  12. హోషేయ 9:17సుమారు క్రీ.పూ. 760

    వారు నా దేవునికి లోబడలేదు కాబట్టి, ఆయన వారిని తిరస్కరించారు; వారు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు.

  13. హోషేయ 10:1సుమారు క్రీ.పూ. 740

    ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.

  14. హోషేయ 10:2సుమారు క్రీ.పూ. 740

    వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.

  15. హోషేయ 10:3సుమారు క్రీ.పూ. 740

    అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.

  16. హోషేయ 10:4సుమారు క్రీ.పూ. 740

    వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు ఒప్పందాలు చేసుకుంటారు; కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో విషపు మొక్కల్లా మొలుస్తాయి.

  17. హోషేయ 10:5సుమారు క్రీ.పూ. 740

    సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.

  18. హోషేయ 10:6సుమారు క్రీ.పూ. 740

    అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.

  19. హోషేయ 10:7సుమారు క్రీ.పూ. 740

    సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.

  20. హోషేయ 10:8సుమారు క్రీ.పూ. 740

    ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.

  21. హోషేయ 10:9సుమారు క్రీ.పూ. 740

    “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు. నీవు అదే స్థితిలో ఉండిపోయావు. గిబియాలోని దుర్మార్గుల మీదికి మరలా యుద్ధం రాలేదా?

  22. హోషేయ 10:10సుమారు క్రీ.పూ. 740

    నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి.

  23. హోషేయ 10:11సుమారు క్రీ.పూ. 740

    ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.

  24. హోషేయ 10:12సుమారు క్రీ.పూ. 740

    మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే.

  25. హోషేయ 10:13సుమారు క్రీ.పూ. 740

    కాని మీరు దున్ని దుష్టత్వాన్ని నాటారు, మీరు చెడును కోశారు, మీరు వంచన ఫలాలు తిన్నారు. మీరు మీ సొంత బలాన్ని, మీకున్న అనేకమంది యోధులను నమ్ముకున్నారు.