కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హోషేయ 7:11సుమారు క్రీ.పూ. 780

    “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.

  2. హోషేయ 7:12సుమారు క్రీ.పూ. 780

    వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.

  3. హోషేయ 7:13సుమారు క్రీ.పూ. 780

    వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.

  4. హోషేయ 7:14సుమారు క్రీ.పూ. 780

    వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, కాని తమ పడకల మీద విలపిస్తారు. ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు కాని వారు నా నుండి తొలగిపోయారు.

  5. హోషేయ 7:15సుమారు క్రీ.పూ. 780

    నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు.

  6. హోషేయ 7:16సుమారు క్రీ.పూ. 780

    వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.

  7. హోషేయ 8:1సుమారు క్రీ.పూ. 780

    “బూర నీ పెదవులపై పెట్టుకో! ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది. ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి, నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.

  8. హోషేయ 8:2సుమారు క్రీ.పూ. 780

    ఇశ్రాయేలు, ‘మా దేవా! మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది.

  9. హోషేయ 8:3సుమారు క్రీ.పూ. 780

    కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.

  10. హోషేయ 8:4సుమారు క్రీ.పూ. 780

    వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు, వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు. వారి వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. అవి వారి సొంత నాశనానికే.

  11. హోషేయ 8:5సుమారు క్రీ.పూ. 780

    సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?

  12. హోషేయ 8:6సుమారు క్రీ.పూ. 780

    ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.

  13. హోషేయ 8:7సుమారు క్రీ.పూ. 780

    “వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.

  14. హోషేయ 8:8సుమారు క్రీ.పూ. 780

    ఇశ్రాయేలు మ్రింగివేయబడింది; ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా, ఇతర దేశాల మధ్య ఉంది.

  15. హోషేయ 8:9సుమారు క్రీ.పూ. 780

    వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా, అష్షూరుకు వెళ్లారు, ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.

  16. హోషేయ 8:10సుమారు క్రీ.పూ. 780

    వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ, నేను వారిని ఇప్పుడు సమకూరుస్తాను. బలవంతుడైన రాజు పెట్టే భారం క్రింద, వారు నీరసించిపోతారు.

  17. హోషేయ 8:11సుమారు క్రీ.పూ. 780

    “పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది, కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి.

  18. హోషేయ 8:12సుమారు క్రీ.పూ. 780

    నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను, కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు.

  19. హోషేయ 8:13సుమారు క్రీ.పూ. 780

    వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, వాటి మాంసం తిన్నా సరే, యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాలను శిక్షిస్తారు: వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.

  20. హోషేయ 8:14సుమారు క్రీ.పూ. 780

    ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి రాజభవనాలను కట్టుకున్నారు; యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను, అది వాటి కోటలను దహించి వేస్తుంది.”

  21. హోషేయ 9:1సుమారు క్రీ.పూ. 760

    ఇశ్రాయేలూ, ఆనందించకు; ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.

  22. హోషేయ 9:2సుమారు క్రీ.పూ. 760

    నూర్పిడి కళ్ళాలు, ద్రాక్ష గానుక తొట్లు ప్రజలను పోషించవు, క్రొత్త ద్రాక్షరసం వారికి మిగలదు.

  23. హోషేయ 9:3సుమారు క్రీ.పూ. 760

    వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.

  24. హోషేయ 9:4సుమారు క్రీ.పూ. 760

    వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు, వారి బలులు ఆయనను సంతోషపరచవు. అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి. వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు. ఈ ఆహారం వారికే సరిపడుతుంది; అది యెహోవా మందిరంలోకి రాదు.

  25. హోషేయ 9:5సుమారు క్రీ.పూ. 760

    మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు?