- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- హోషేయ 4:6సుమారు క్రీ.పూ. 780
జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. “మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి, నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను; మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి, నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.
- హోషేయ 4:7సుమారు క్రీ.పూ. 780
యాజకుల సంఖ్య పెరిగిన కొద్దీ, వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు; వారి ఘనతను అవమానంగా మారుస్తాను.
- హోషేయ 4:8సుమారు క్రీ.పూ. 780
నా ప్రజల పాపాన్ని ఆహారంగా చేసుకుంటారు వారి దుష్టత్వం ఎక్కువ కావాలని కోరుకుంటారు.
- హోషేయ 4:9సుమారు క్రీ.పూ. 780
కాబట్టి ప్రజలు జరిగినట్లే యాజకులకు జరుగుతుంది. వారి విధానాలను బట్టి వారిద్దరిని నేను శిక్షిస్తాను వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికిస్తాను.
- హోషేయ 4:10సుమారు క్రీ.పూ. 780
“వారు తింటారు, కాని తృప్తి పొందరు; వారు వ్యభిచారం చేస్తారు, కాని అభివృద్ధి చెందరు, ఎందుకంటే వారు యెహోవాను వదిలేశారు, తమను తాము
- హోషేయ 4:11సుమారు క్రీ.పూ. 780
వ్యభిచారానికి అప్పగించుకున్నారు; పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం వారి మతిని పోగొట్టాయి.
- హోషేయ 4:12సుమారు క్రీ.పూ. 780
నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.
- హోషేయ 4:13సుమారు క్రీ.పూ. 780
వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.
- హోషేయ 4:14సుమారు క్రీ.పూ. 780
“మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు, నేను వారిని శిక్షించను, మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు, నేను వారిని శిక్షించను ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు, క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు, గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు.
- హోషేయ 4:15సుమారు క్రీ.పూ. 780
“ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, యూదా అపరాధం చేయకూడదు. “గిల్గాలుకు వెళ్లవద్దు; బేత్-ఆవెనుకు వెళ్లవద్దు. ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.
- హోషేయ 4:16సుమారు క్రీ.పూ. 780
పొగరుబోతు పెయ్యలా ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు. అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు?
- హోషేయ 4:17సుమారు క్రీ.పూ. 780
ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి!
- హోషేయ 4:18సుమారు క్రీ.పూ. 780
వారి పానీయాలు అయిపోయినా, వారి వ్యభిచారం కొనసాగిస్తున్నారు; వారి పాలకులు సిగ్గుమాలిన విధానాలను ఎంతో ఇష్టపడతారు.
- హోషేయ 4:19సుమారు క్రీ.పూ. 780
సుడిగాలి వారిని చెదరగొడుతుంది, వారి బలుల వలన వారికి అవమానం కలుగుతుంది.
- హోషేయ 5:1సుమారు క్రీ.పూ. 780
“యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.
- హోషేయ 5:2సుమారు క్రీ.పూ. 780
తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు. వారందరిని నేను శిక్షిస్తాను.
- హోషేయ 5:3సుమారు క్రీ.పూ. 780
ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు; ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు. ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు; ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
- హోషేయ 5:4సుమారు క్రీ.పూ. 780
“వారి పనుల వలన వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; వారు యెహోవాను గుర్తించరు.
- హోషేయ 5:5సుమారు క్రీ.పూ. 780
ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది.
- హోషేయ 5:6సుమారు క్రీ.పూ. 780
వారు యెహోవాను వెదకడానికి తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, ఆయనను కనుగొనరు; ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు.
- హోషేయ 5:7సుమారు క్రీ.పూ. 780
వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు; వారు అక్రమ సంతానాన్ని కన్నారు. వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు, ఆయన వారి భూములను నాశనం చేస్తారు.
- హోషేయ 5:8సుమారు క్రీ.పూ. 780
“గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.
- హోషేయ 5:9సుమారు క్రీ.పూ. 780
దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.
- హోషేయ 5:10సుమారు క్రీ.పూ. 780
యూదా నాయకులు సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. వారి మీద నా కోపాన్ని నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను.
- హోషేయ 5:11సుమారు క్రీ.పూ. 780
ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి వారు హింసించబడతారు, తీర్పులో త్రొక్కబడతారు.