కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 4:15సుమారు క్రీ.పూ. 1011

    నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,

  2. 2 దినవృత్తాంతములు 4:16సుమారు క్రీ.పూ. 1011

    కుండలు, చేటలు, ముండ్ల కొంకులు మొదలైన పాత్రలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.

  3. 2 దినవృత్తాంతములు 4:17సుమారు క్రీ.పూ. 1011

    రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.

  4. 2 దినవృత్తాంతములు 4:18సుమారు క్రీ.పూ. 1011

    సొలొమోను చేయించిన ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఇత్తడి బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.

  5. 2 దినవృత్తాంతములు 4:19సుమారు క్రీ.పూ. 1011

    దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు,

  6. 2 దినవృత్తాంతములు 4:20సుమారు క్రీ.పూ. 1011

    గర్భాలయం ఎదుట వెలుతురు ఉండడానికి మేలిమి బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు,

  7. 2 దినవృత్తాంతములు 4:21సుమారు క్రీ.పూ. 1011

    వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు,

  8. 2 దినవృత్తాంతములు 4:22సుమారు క్రీ.పూ. 1011

    మేలిమి బంగారు చేసిన వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; మందిర బంగారు తలుపులు: అతి పరిశుద్ధ స్థలానికి లోపలి తలుపులు, ప్రధాన గది తలుపులు.

  9. 2 దినవృత్తాంతములు 5:1సుమారు క్రీ.పూ. 1004

    రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి, యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.

  10. 2 దినవృత్తాంతములు 5:2సుమారు క్రీ.పూ. 1004

    అప్పుడు సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేముకు పిలిపించాడు.

  11. 2 దినవృత్తాంతములు 5:3సుమారు క్రీ.పూ. 1004

    ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజు ఎదుట సమావేశమయ్యారు.

  12. 2 దినవృత్తాంతములు 5:4సుమారు క్రీ.పూ. 1004

    ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, లేవీయులు నిబంధన మందసాన్ని తీసుకుని,

  13. 2 దినవృత్తాంతములు 5:5సుమారు క్రీ.పూ. 1004

    మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. లేవీయులైన యాజకులు వాటిని పైకి మోసుకెళ్లారు;

  14. 2 దినవృత్తాంతములు 5:6సుమారు క్రీ.పూ. 1004

    రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.

  15. 2 దినవృత్తాంతములు 5:7సుమారు క్రీ.పూ. 1004

    తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.

  16. 2 దినవృత్తాంతములు 5:8సుమారు క్రీ.పూ. 1004

    కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపి మందసాన్ని దానిని మోసే కర్రలను కప్పివేశాయి.

  17. 2 దినవృత్తాంతములు 5:9సుమారు క్రీ.పూ. 1004

    ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు మందసం నుండి విస్తరించి, గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.

  18. 2 దినవృత్తాంతములు 5:10సుమారు క్రీ.పూ. 1004

    మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.

  19. 2 దినవృత్తాంతములు 5:11సుమారు క్రీ.పూ. 1004

    తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

  20. 2 దినవృత్తాంతములు 5:12సుమారు క్రీ.పూ. 1004

    సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు.

  21. 2 దినవృత్తాంతములు 5:13సుమారు క్రీ.పూ. 1004

    బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: “యెహోవా మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని పాడారు. అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.

  22. 2 దినవృత్తాంతములు 5:14సుమారు క్రీ.పూ. 1004

    యెహోవా మహిమ దేవుని మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.

  23. 2 దినవృత్తాంతములు 6:1సుమారు క్రీ.పూ. 1004

    అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;

  24. 2 దినవృత్తాంతములు 6:2సుమారు క్రీ.పూ. 1004

    నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను. అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.

  25. 2 దినవృత్తాంతములు 6:3సుమారు క్రీ.పూ. 1004

    ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.