- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 6:4సుమారు క్రీ.పూ. 1004
అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:
- 2 దినవృత్తాంతములు 6:5సుమారు క్రీ.పూ. 1004
‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు.
- 2 దినవృత్తాంతములు 6:6సుమారు క్రీ.పూ. 1004
అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’
- 2 దినవృత్తాంతములు 6:7సుమారు క్రీ.పూ. 1004
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.
- 2 దినవృత్తాంతములు 6:8సుమారు క్రీ.పూ. 1004
కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.
- 2 దినవృత్తాంతములు 6:9సుమారు క్రీ.పూ. 1004
అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.
- 2 దినవృత్తాంతములు 6:10సుమారు క్రీ.పూ. 1004
“యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.
- 2 దినవృత్తాంతములు 6:11సుమారు క్రీ.పూ. 1004
యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను తెలిపే మందసాన్ని మందిరంలో అక్కడ పెట్టాను.”
- 2 దినవృత్తాంతములు 6:12సుమారు క్రీ.పూ. 1004
అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేశాడు.
- 2 దినవృత్తాంతములు 6:13సుమారు క్రీ.పూ. 1004
తర్వాత సొలొమోను అయిదు మూరల పొడవు, అయిదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తుతో ఒక ఇత్తడి వేదికను తయారుచేసి, బయటి ఆవరణ మధ్యలో ఉంచాడు. అతడు వేదికపై నిలబడి, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో మోకరిల్లి, ఆకాశం వైపు చేతులు చాపాడు.
- 2 దినవృత్తాంతములు 6:14సుమారు క్రీ.పూ. 1004
అతడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.
- 2 దినవృత్తాంతములు 6:15సుమారు క్రీ.పూ. 1004
మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.
- 2 దినవృత్తాంతములు 6:16సుమారు క్రీ.పూ. 1004
“ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.
- 2 దినవృత్తాంతములు 6:17సుమారు క్రీ.పూ. 1004
ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి.
- 2 దినవృత్తాంతములు 6:18సుమారు క్రీ.పూ. 1004
“అయితే దేవుడు భూమి మీద మనుష్యులతో నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశాలు మీకు సరిపోవు. నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది?
- 2 దినవృత్తాంతములు 6:19సుమారు క్రీ.పూ. 1004
అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి.
- 2 దినవృత్తాంతములు 6:20సుమారు క్రీ.పూ. 1004
మీ పేరు అక్కడ ఉంటుందని మీరు చెప్పిన స్థలం వైపు తిరిగి మీ దాసుడు చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉండును గాక.
- 2 దినవృత్తాంతములు 6:21సుమారు క్రీ.పూ. 1004
మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపాలు ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి; మీరు విన్నప్పుడు క్షమించండి.
- 2 దినవృత్తాంతములు 6:22సుమారు క్రీ.పూ. 1004
“ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు,
- 2 దినవృత్తాంతములు 6:23సుమారు క్రీ.పూ. 1004
మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి.
- 2 దినవృత్తాంతములు 6:24సుమారు క్రీ.పూ. 1004
“మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరం ఎదుట మిమ్మల్ని వేడుకున్నప్పుడు,
- 2 దినవృత్తాంతములు 6:25సుమారు క్రీ.పూ. 1004
మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.
- 2 దినవృత్తాంతములు 6:26సుమారు క్రీ.పూ. 1004
“మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే,
- 2 దినవృత్తాంతములు 6:27సుమారు క్రీ.పూ. 1004
మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.
- 2 దినవృత్తాంతములు 6:28సుమారు క్రీ.పూ. 1004
“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,