కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 3:7సుమారు క్రీ.పూ. 1011

    మందిర దూలాలను, స్తంభాలను, గోడలను, తలుపులను బంగారంతో పొదిగించాడు. గోడ మీద కెరూబు చెక్కించాడు.

  2. 2 దినవృత్తాంతములు 3:8సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది.

  3. 2 దినవృత్తాంతములు 3:9సుమారు క్రీ.పూ. 1011

    బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు, మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు.

  4. 2 దినవృత్తాంతములు 3:10సుమారు క్రీ.పూ. 1011

    అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు.

  5. 2 దినవృత్తాంతములు 3:11సుమారు క్రీ.పూ. 1011

    ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది.

  6. 2 దినవృత్తాంతములు 3:12సుమారు క్రీ.పూ. 1011

    అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది.

  7. 2 దినవృత్తాంతములు 3:13సుమారు క్రీ.పూ. 1011

    ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి.

  8. 2 దినవృత్తాంతములు 3:14సుమారు క్రీ.పూ. 1011

    సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు.

  9. 2 దినవృత్తాంతములు 3:15సుమారు క్రీ.పూ. 1011

    మందిరం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్పై అయిదు మూరలు. వాటి మీద అయిదు మూరల ఎత్తుగల పీటలు కూడా చేయించాడు.

  10. 2 దినవృత్తాంతములు 3:16సుమారు క్రీ.పూ. 1011

    అతడు అల్లిన గొలుసులు చేయించి స్తంభాల పైభాగంలో పెట్టాడు. వంద దానిమ్మపండ్లు కూడా చేసి గొలుసులకు తగిలించాడు.

  11. 2 దినవృత్తాంతములు 3:17సుమారు క్రీ.పూ. 1011

    మందిరం ముందు భాగంలో స్తంభాలను ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు.

  12. 2 దినవృత్తాంతములు 4:1సుమారు క్రీ.పూ. 1011

    హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.

  13. 2 దినవృత్తాంతములు 4:2సుమారు క్రీ.పూ. 1011

    అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.

  14. 2 దినవృత్తాంతములు 4:3సుమారు క్రీ.పూ. 1011

    దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ ఎడ్ల రూపాలు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ ఎడ్లు రెండు వరుసలుగా పోత పోశారు.

  15. 2 దినవృత్తాంతములు 4:4సుమారు క్రీ.పూ. 1011

    ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.

  16. 2 దినవృత్తాంతములు 4:5సుమారు క్రీ.పూ. 1011

    అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో మూడు వేల బాతుల నీళ్లు పడతాయి.

  17. 2 దినవృత్తాంతములు 4:6సుమారు క్రీ.పూ. 1011

    దహనబలుల కోసం వాడే వాటిని కడగడానికి అతడు పది చిన్న గంగాళాలు చేయించి, దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదింటిని పెట్టాడు. వాటిలో దహనబలుల కోసం వాడే వాటిని కడుగబడతాయి, అయితే పెద్ద గంగాళం యాజకులు కడుక్కోడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

  18. 2 దినవృత్తాంతములు 4:7సుమారు క్రీ.పూ. 1011

    అతడు వాటి వివరాల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను తయారుచేసి వాటిని మందిరంలో అయిదు దక్షిణం వైపు అయిదు ఉత్తరం వైపు ఉంచాడు.

  19. 2 దినవృత్తాంతములు 4:8సుమారు క్రీ.పూ. 1011

    పది బల్లలను చేయించి మందిరంలో దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు.

  20. 2 దినవృత్తాంతములు 4:9సుమారు క్రీ.పూ. 1011

    యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు.

  21. 2 దినవృత్తాంతములు 4:10సుమారు క్రీ.పూ. 1011

    గంగాళాన్ని మందిరానికి దక్షిణ వైపున ముఖాన్ని ఆగ్నేయ దిక్కుకు త్రిప్పి ఉంచాడు.

  22. 2 దినవృత్తాంతములు 4:11సుమారు క్రీ.పూ. 1011

    హూరాము కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:

  23. 2 దినవృత్తాంతములు 4:12సుమారు క్రీ.పూ. 1011

    రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి రెండు అల్లికలు,

  24. 2 దినవృత్తాంతములు 4:13సుమారు క్రీ.పూ. 1011

    స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,

  25. 2 దినవృత్తాంతములు 4:14సుమారు క్రీ.పూ. 1011

    ఆ పీటలు వాటిపై ఉన్న తొట్లు,