- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 2 దినవృత్తాంతములు 1:17సుమారు క్రీ.పూ. 1015
వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
- 2 దినవృత్తాంతములు 2:1సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు.
- 2 దినవృత్తాంతములు 2:2సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు.
- 2 దినవృత్తాంతములు 2:3సుమారు క్రీ.పూ. 1015
తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి.
- 2 దినవృత్తాంతములు 2:4సుమారు క్రీ.పూ. 1015
ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.
- 2 దినవృత్తాంతములు 2:5సుమారు క్రీ.పూ. 1015
“మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది.
- 2 దినవృత్తాంతములు 2:6సుమారు క్రీ.పూ. 1015
అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.
- 2 దినవృత్తాంతములు 2:7సుమారు క్రీ.పూ. 1015
“యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి.
- 2 దినవృత్తాంతములు 2:8సుమారు క్రీ.పూ. 1015
“లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు.
- 2 దినవృత్తాంతములు 2:9సుమారు క్రీ.పూ. 1015
నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి.
- 2 దినవృత్తాంతములు 2:10సుమారు క్రీ.పూ. 1015
దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా 20,000 కోరుల గోధుమ పిండిని, 20,000 కోరుల యవలు, 20,000 బాతుల ద్రాక్షరసం, 20,000 బాతుల ఒలీవనూనె ఇస్తాను.”
- 2 దినవృత్తాంతములు 2:11సుమారు క్రీ.పూ. 1015
దానికి జవాబుగా తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక లేఖ వ్రాశాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే నిన్ను వారిమీద రాజుగా నియమించాడు.”
- 2 దినవృత్తాంతములు 2:12సుమారు క్రీ.పూ. 1015
అందుకు హీరాము, “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన స్తుతిపాత్రుడు! ఆయన రాజైన దావీదుకు బుద్ధిగల కుమారున్ని ఇచ్చారు. ఆ కుమారుడు జ్ఞానం, వివేకం గలవాడై, యెహోవా పేరిట మందిరం, తనకు రాజభవనం కట్టిస్తాడు.
- 2 దినవృత్తాంతములు 2:13సుమారు క్రీ.పూ. 1015
“మీ దగ్గరకు హూరాము-అబి అనే జ్ఞానంగల వ్యక్తిని పంపిస్తున్నాను. అతడు గొప్ప నేర్పుగలవాడు.
- 2 దినవృత్తాంతములు 2:14సుమారు క్రీ.పూ. 1015
అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు.
- 2 దినవృత్తాంతములు 2:15సుమారు క్రీ.పూ. 1015
“నా యజమానులైన మీరు చెప్పినట్టే ఇప్పుడు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసం మీ సేవకులకిచ్చి పంపించండి.
- 2 దినవృత్తాంతములు 2:16సుమారు క్రీ.పూ. 1015
మీరు కావాలన్న దూలాలను మేము లెబానోను అడవుల నుండి నరికి సముద్రం మీద తెప్పలుగా కట్టి, యొప్ప పట్టణం దాకా తెస్తాము. అక్కడినుండి మీరు వాటిని యెరూషలేముకు తీసుకెళ్లవచ్చు.”
- 2 దినవృత్తాంతములు 2:17సుమారు క్రీ.పూ. 1015
సొలొమోను ఇశ్రాయేలులో ఉంటున్న పరాయి దేశస్థుల జనాభా లెక్కలు తీయించాడు. తన తండ్రియైన దావీదు చేయించిన లెక్కల ప్రకారం అలాంటి వారికి లెక్కించినప్పుడు మొత్తం 1,53,600 మంది ఉన్నారు.
- 2 దినవృత్తాంతములు 2:18సుమారు క్రీ.పూ. 1015
వారిలో బరువులు మోయడానికి 70,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి 80,000 మందిని నియమించాడు. పని సక్రమంగా జరిగేటట్టు చూడడానికి 3,600 మందిని పనివారి మీద అధికారులుగా నియమించాడు.
- 2 దినవృత్తాంతములు 3:1సుమారు క్రీ.పూ. 1011
ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు.
- 2 దినవృత్తాంతములు 3:2సుమారు క్రీ.పూ. 1011
అతడు తన పాలనలోని నాలుగవ సంవత్సరం రెండవ నెల రెండవ రోజున కట్టడం ప్రారంభించాడు.
- 2 దినవృత్తాంతములు 3:3సుమారు క్రీ.పూ. 1011
సొలొమోను దేవుని ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
- 2 దినవృత్తాంతములు 3:4సుమారు క్రీ.పూ. 1011
మందిరం విశాల గదికి ముందు మంటపం ఉంది. దాని పొడవు ఇరవై మూరలు, ఎత్తు నూట ఇరవై మూరలు. లోపలిభాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
- 2 దినవృత్తాంతములు 3:5సుమారు క్రీ.పూ. 1011
అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు.
- 2 దినవృత్తాంతములు 3:6సుమారు క్రీ.పూ. 1011
మందిరాన్ని ప్రశస్తమైన రాళ్లతో అలంకరించాడు. అతడు ఉపయోగించిన బంగారం పర్వయీము నుండి తెచ్చింది.