- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 11:10సుమారు క్రీ.పూ. 984
ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు.
- 1 రాజులు 11:11సుమారు క్రీ.పూ. 984
కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, “నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను.
- 1 రాజులు 11:12సుమారు క్రీ.పూ. 984
అయినాసరే, నీ తండ్రియైన దావీదును బట్టి, నీ జీవితకాలంలో అలా చేయను, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను.
- 1 రాజులు 11:13సుమారు క్రీ.పూ. 984
అయితే అతని నుండి రాజ్యాన్నంతా తీసివేయను కాని నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎన్నుకున్న యెరూషలేమును బట్టి, నేను నీ కుమారునికి ఒక్క గోత్రం ఇస్తాను.”
- 1 రాజులు 11:14సుమారు క్రీ.పూ. 984
తర్వాత యెహోవా ఎదోము రాజవంశానికి చెందిన ఎదోమీయుడైన హదదును సొలొమోనుకు విరోధిగా లేపారు.
- 1 రాజులు 11:15సుమారు క్రీ.పూ. 984
గతంలో దావీదు ఎదోము మీద యుద్ధం చేస్తున్నప్పుడు సేనాధిపతి యోవాబు చనిపోయినవారిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు, అతడు ఎదోములోని మగవారందరినీ చంపాడు.
- 1 రాజులు 11:16సుమారు క్రీ.పూ. 984
ఎదోములో ఉన్న మగవారందరు నిర్మూలం చనిపోయే వరకు యోవాబు ఇశ్రాయేలు వారందరితో పాటు ఆరు నెలలు అక్కడ ఉండిపోయాడు.
- 1 రాజులు 11:17సుమారు క్రీ.పూ. 984
అయితే అప్పుడు హదదు చిన్నవాడు, అతడు తన తండ్రి సేవకులైన కొంతమంది ఎదోమీయుల అధికారులతో ఈజిప్టుకు పారిపోయాడు.
- 1 రాజులు 11:18సుమారు క్రీ.పూ. 984
వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.
- 1 రాజులు 11:19సుమారు క్రీ.పూ. 984
ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు.
- 1 రాజులు 11:20సుమారు క్రీ.పూ. 984
తహ్పెనేసు సోదరికి హదదుకు గెనుబతు అనే కుమారుడు పుట్టాడు. తహ్పెనేసు రాజభవనంలో అతన్ని పెంచింది. గెనుబతు ఫరో సొంత పిల్లలతో కలిసి పెరిగాడు.
- 1 రాజులు 11:21సుమారు క్రీ.పూ. 984
దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడని, అతని సేనాధిపతియైన యోవాబు కూడా చనిపోయాడని హదదు ఈజిప్టులో ఉన్నప్పుడు విన్నాడు. అప్పుడు హదదు ఫరోతో, “నా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నన్ను అనుమతించండి” అన్నాడు.
- 1 రాజులు 11:22సుమారు క్రీ.పూ. 984
అందుకు ఫరో, “నా దగ్గర నీకేం తక్కువైందని నీవు నీ స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నావు?” అని అడిగాడు. అందుకు హదదు, “ఏమీ తక్కువ కాలేదు కాని దయచేసి మీరు నన్ను వెళ్లనివ్వండి” అన్నాడు.
- 1 రాజులు 11:23సుమారు క్రీ.పూ. 984
దేవుడు సొలొమోను మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే ఇంకొక విరోధిని లేపారు; ఇతడు తన యజమాని సోబా రాజైన హదదెజెరు నుండి పారిపోయిన వాడు.
- 1 రాజులు 11:24సుమారు క్రీ.పూ. 984
దావీదు సోబా సైన్యాన్ని నిర్మూలం చేసినప్పుడు, రెజోను కొంతమంది తిరుగుబాటుదారుల గుంపు పోగుచేసుకుని వారికి నాయకునిగా ఉన్నాడు; వారు దమస్కుకు వెళ్లి స్థిరపడి, ఆ పట్టణాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు.
- 1 రాజులు 11:25సుమారు క్రీ.పూ. 984
హదదు ఇశ్రాయేలుకు చేసిన కీడు కాకుండా సొలొమోను జీవించిన కాలమంతా రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నాడు. రెజోను సిరియాను పరిపాలించాడు, ఇశ్రాయేలును అసహ్యించుకునేవాడు.
- 1 రాజులు 11:26సుమారు క్రీ.పూ. 984
నెబాతు కుమారుడైన యరొబాము కూడా రాజుపై తిరుగుబాటు చేశాడు. అతడు సొలొమోను సేవకులలో ఒకడు, జెరేదా వాడైన ఎఫ్రాయిమీయుడు. అతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు.
- 1 రాజులు 11:27సుమారు క్రీ.పూ. 984
యరొబాము రాజు మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఇది: సొలొమోను మేడలను కట్టించాడు, తన తండ్రి దావీదు పట్టణ ప్రాకారంలో ఉన్న బీటలను బాగుచేయించాడు.
- 1 రాజులు 11:28సుమారు క్రీ.పూ. 984
యరొబాము సమర్థుడు, ఆ యువకుడు మంచిగా పని చేయడాన్ని సొలొమోను చూసి, యోసేపు గోత్రానికి చెందిన ప్రదేశంలో వెట్టి పని చేసేవారిమీద అతన్ని అధికారిగా నియమించాడు.
- 1 రాజులు 11:29సుమారు క్రీ.పూ. 984
ఆ సమయంలో యరొబాము యెరూషలేము విడిచి వెళ్తుండగా, త్రోవలో షిలోహు వాడైన అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రం ధరించుకొని అతన్ని కలిశాడు. వారిద్దరు తప్ప ఆ పొలంలో ఇంకెవరు లేరు.
- 1 రాజులు 11:30సుమారు క్రీ.పూ. 984
అప్పుడు అహీయా తాను వేసుకున్న ఆ క్రొత్త వస్త్రాన్ని తీసి పన్నెండు ముక్కలుగా చింపాడు.
- 1 రాజులు 11:31సుమారు క్రీ.పూ. 984
అప్పుడు అతడు యరొబాముతో, “నీవు పది ముక్కలు తీసుకో, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘సొలొమోను చేతిలో నుండి నేను రాజ్యం చీల్చి పది గోత్రాలు నీకు ఇవ్వబోతున్నాను.
- 1 రాజులు 11:32సుమారు క్రీ.పూ. 984
కాని నా సేవకుడైన దావీదును బట్టి, నా కోసం ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని బట్టి అతడు ఒక గోత్రం కలిగి ఉంటాడు.
- 1 రాజులు 11:33సుమారు క్రీ.పూ. 984
నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు.
- 1 రాజులు 11:34సుమారు క్రీ.పూ. 984
“ ‘అయితే నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్నంతా తీసివేయను; నా కోసం ఎన్నుకున్న నా సేవకుడు, నా ఆజ్ఞలకు, శాసనాలకు లోబడిన దావీదును బట్టి, సొలొమోనును తన జీవితకాలమంతా పాలకునిగా నియమించాను.