కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 11:35సుమారు క్రీ.పూ. 984

    అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి పది గోత్రాలను నీకు ఇస్తాను.

  2. 1 రాజులు 11:36సుమారు క్రీ.పూ. 984

    నా పేరు అక్కడ ఉండాలని నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణంలో నా సేవకుడైన దావీదు కోసం నా సన్నిధిలో ఒక దీపం ఎల్లప్పుడు ఉండడం కోసం నేను అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను.

  3. 1 రాజులు 11:37సుమారు క్రీ.పూ. 984

    నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీవు కోరుకున్న ప్రకారం నీవు పరిపాలిస్తావు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు.

  4. 1 రాజులు 11:38సుమారు క్రీ.పూ. 984

    నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను.

  5. 1 రాజులు 11:39సుమారు క్రీ.పూ. 984

    వారు చేసిన దానికి నేను దావీదు సంతానాన్ని శిక్షిస్తాను కాని ఎప్పటికి కాదు.’ ”

  6. 1 రాజులు 11:40సుమారు క్రీ.పూ. 984

    సొలొమోను యరొబామును చంపే ప్రయత్నం చేశాడు కాని, యరొబాము ఈజిప్టుకు షీషకు రాజు దగ్గరకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు.

  7. 1 రాజులు 11:41సుమారు క్రీ.పూ. 984

    సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాయబడినవి.

  8. 1 రాజులు 11:42సుమారు క్రీ.పూ. 984

    సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలంతటిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు.

  9. 1 రాజులు 11:43సుమారు క్రీ.పూ. 975

    తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.

  10. 2 దినవృత్తాంతములు 1:1సుమారు క్రీ.పూ. 1015

    దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు.

  11. 2 దినవృత్తాంతములు 1:2సుమారు క్రీ.పూ. 1015

    అప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయులందరితో అంటే సహస్రాధిపతులతో, శతాధిపతులతో, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలులోని నాయకులందరితో, కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.

  12. 2 దినవృత్తాంతములు 1:3సుమారు క్రీ.పూ. 1015

    సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది.

  13. 2 దినవృత్తాంతములు 1:4సుమారు క్రీ.పూ. 1015

    దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు.

  14. 2 దినవృత్తాంతములు 1:5సుమారు క్రీ.పూ. 1015

    అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు.

  15. 2 దినవృత్తాంతములు 1:6సుమారు క్రీ.పూ. 1015

    సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

  16. 2 దినవృత్తాంతములు 1:7సుమారు క్రీ.పూ. 1015

    ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.

  17. 2 దినవృత్తాంతములు 1:8సుమారు క్రీ.పూ. 1015

    అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు.

  18. 2 దినవృత్తాంతములు 1:9సుమారు క్రీ.పూ. 1015

    యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు.

  19. 2 దినవృత్తాంతములు 1:10సుమారు క్రీ.పూ. 1015

    నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”

  20. 2 దినవృత్తాంతములు 1:11సుమారు క్రీ.పూ. 1015

    దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు,

  21. 2 దినవృత్తాంతములు 1:12సుమారు క్రీ.పూ. 1015

    కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు.

  22. 2 దినవృత్తాంతములు 1:13సుమారు క్రీ.పూ. 1015

    తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.

  23. 2 దినవృత్తాంతములు 1:14సుమారు క్రీ.పూ. 1015

    సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.

  24. 2 దినవృత్తాంతములు 1:15సుమారు క్రీ.పూ. 1015

    రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.

  25. 2 దినవృత్తాంతములు 1:16సుమారు క్రీ.పూ. 1015

    సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.