కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రోమీయులకు 15:28సుమారు క్రీ.శ. 60

    నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందించి, తర్వాత అక్కడినుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను.

  2. రోమీయులకు 15:29సుమారు క్రీ.శ. 60

    నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.

  3. రోమీయులకు 15:30సుమారు క్రీ.శ. 60

    సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను.

  4. రోమీయులకు 15:31సుమారు క్రీ.శ. 60

    యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించుకునేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న పరిశుద్ధులు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి.

  5. రోమీయులకు 15:32సుమారు క్రీ.శ. 60

    అప్పుడు నేను దేవుని చిత్తమైతే సంతోషంగా మీ దగ్గరకు వచ్చి మీ సహవాసంలో విశ్రాంతి తీసుకుంటాను.

  6. రోమీయులకు 15:33సుమారు క్రీ.శ. 60

    సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్.

  7. రోమీయులకు 16:1సుమారు క్రీ.శ. 60

    కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను.

  8. రోమీయులకు 16:2సుమారు క్రీ.శ. 60

    నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది.

  9. రోమీయులకు 16:3సుమారు క్రీ.శ. 60

    యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి.

  10. రోమీయులకు 16:4సుమారు క్రీ.శ. 60

    వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు.

  11. రోమీయులకు 16:5సుమారు క్రీ.శ. 60

    అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.

  12. రోమీయులకు 16:6సుమారు క్రీ.శ. 60

    మీ కోసం ఎంతో కష్టపడిన మరియకు వందనాలు తెలియజేయండి.

  13. రోమీయులకు 16:7సుమారు క్రీ.శ. 60

    నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు.

  14. రోమీయులకు 16:8సుమారు క్రీ.శ. 60

    ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి.

  15. రోమీయులకు 16:9సుమారు క్రీ.శ. 60

    క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి.

  16. రోమీయులకు 16:10సుమారు క్రీ.శ. 60

    క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి. అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వారికి వందనాలు తెలియజేయండి.

  17. రోమీయులకు 16:11సుమారు క్రీ.శ. 60

    నా తోటి యూదుడైన హెరోదియోనుకు వందనాలు తెలియజేయండి. నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి.

  18. రోమీయులకు 16:12సుమారు క్రీ.శ. 60

    ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి. ప్రభువులో ఎంతో కష్టపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి.

  19. రోమీయులకు 16:13సుమారు క్రీ.శ. 60

    ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే.

  20. రోమీయులకు 16:14సుమారు క్రీ.శ. 60

    అసుంక్రితు, ప్లెగోను, హెర్మెసు, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి.

  21. రోమీయులకు 16:15సుమారు క్రీ.శ. 60

    పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.

  22. రోమీయులకు 16:16సుమారు క్రీ.శ. 60

    పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి. క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి.

  23. రోమీయులకు 16:17సుమారు క్రీ.శ. 60

    సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించమని వేడుకుంటున్నాను. వారికి దూరంగా ఉండండి.

  24. రోమీయులకు 16:18సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.

  25. రోమీయులకు 16:19సుమారు క్రీ.శ. 60

    మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను.