కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రోమీయులకు 15:3సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.

  2. రోమీయులకు 15:4సుమారు క్రీ.శ. 60

    గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.

  3. రోమీయులకు 15:5సుమారు క్రీ.శ. 60

    మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా,

  4. రోమీయులకు 15:6సుమారు క్రీ.శ. 60

    మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక.

  5. రోమీయులకు 15:7సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి.

  6. రోమీయులకు 15:8సుమారు క్రీ.శ. 60

    పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”

  7. రోమీయులకు 15:9సుమారు క్రీ.శ. 60

    And that the Gentiles might glorify God for his mercy; as it is written, For this cause I will confess to thee among the Gentiles, and sing unto thy name.

  8. రోమీయులకు 15:10సుమారు క్రీ.శ. 60

    అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”

  9. రోమీయులకు 15:11సుమారు క్రీ.శ. 60

    మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”

  10. రోమీయులకు 15:12సుమారు క్రీ.శ. 60

    మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.”

  11. రోమీయులకు 15:13సుమారు క్రీ.శ. 60

    పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.

  12. రోమీయులకు 15:14సుమారు క్రీ.శ. 60

    నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.

  13. రోమీయులకు 15:15సుమారు క్రీ.శ. 60

    అయినా నేను కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుచేయాలని చాలా ధైర్యంగా మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.

  14. రోమీయులకు 15:16సుమారు క్రీ.శ. 60

    That I should be the minister of Jesus Christ to the Gentiles, ministering the gospel of God, that the offering up of the Gentiles might be acceptable, being sanctified by the Holy Ghost.

  15. రోమీయులకు 15:17సుమారు క్రీ.శ. 60

    అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను.

  16. రోమీయులకు 15:18సుమారు క్రీ.శ. 60

    పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను.

  17. రోమీయులకు 15:19సుమారు క్రీ.శ. 60

    కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.

  18. రోమీయులకు 15:20సుమారు క్రీ.శ. 60

    మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకూడదని క్రీస్తు గురించి తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది.

  19. రోమీయులకు 15:21సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

  20. రోమీయులకు 15:22సుమారు క్రీ.శ. 60

    దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి.

  21. రోమీయులకు 15:23సుమారు క్రీ.శ. 60

    అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను పని చేయడానికి నాకిక స్థలమేమి లేదు. మిమ్మల్ని దర్శించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను.

  22. రోమీయులకు 15:24సుమారు క్రీ.శ. 60

    కాబట్టి నేను స్పెయినుకు వెళ్లేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంతకాలం మీ సహవాసంలో ఆనందించిన తర్వాత అక్కడినుండి మీరు నన్ను సాగనంపాలని ఆశిస్తున్నాను.

  23. రోమీయులకు 15:25సుమారు క్రీ.శ. 60

    అయితే ఇప్పుడు, నేను యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను.

  24. రోమీయులకు 15:26సుమారు క్రీ.శ. 60

    యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకాయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు.

  25. రోమీయులకు 15:27సుమారు క్రీ.శ. 60

    వారు దాన్ని సంతోషంతో చేశారు. నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకున్నారు కాబట్టి తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకుని వారు రుణపడి ఉన్నారు.