కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రోమీయులకు 16:20సుమారు క్రీ.శ. 60

    సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

  2. రోమీయులకు 16:21సుమారు క్రీ.శ. 60

    నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.

  3. రోమీయులకు 16:22సుమారు క్రీ.శ. 60

    ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.

  4. రోమీయులకు 16:23సుమారు క్రీ.శ. 60

    నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.

  5. రోమీయులకు 16:24సుమారు క్రీ.శ. 60

    మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.

  6. రోమీయులకు 16:25సుమారు క్రీ.శ. 60

    యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.

  7. రోమీయులకు 16:26సుమారు క్రీ.శ. 60

    But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith:

  8. రోమీయులకు 16:27సుమారు క్రీ.శ. 60

    To God only wise, be glory through Jesus Christ for ever. Amen.

  9. 1 కొరింథీయులకు 1:1సుమారు క్రీ.శ. 59

    దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,

  10. 1 కొరింథీయులకు 1:2సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది:

  11. 1 కొరింథీయులకు 1:3సుమారు క్రీ.శ. 59

    మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.

  12. 1 కొరింథీయులకు 1:4సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  13. 1 కొరింథీయులకు 1:5సుమారు క్రీ.శ. 59

    దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కాబట్టి,

  14. 1 కొరింథీయులకు 1:6సుమారు క్రీ.శ. 59

    మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు.

  15. 1 కొరింథీయులకు 1:7సుమారు క్రీ.శ. 59

    కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

  16. 1 కొరింథీయులకు 1:8సుమారు క్రీ.శ. 59

    ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు.

  17. 1 కొరింథీయులకు 1:9సుమారు క్రీ.శ. 59

    తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

  18. 1 కొరింథీయులకు 1:10సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

  19. 1 కొరింథీయులకు 1:11సుమారు క్రీ.శ. 59

    నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు.

  20. 1 కొరింథీయులకు 1:12సుమారు క్రీ.శ. 59

    నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.

  21. 1 కొరింథీయులకు 1:13సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా?

  22. 1 కొరింథీయులకు 1:14సుమారు క్రీ.శ. 59

    నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

  23. 1 కొరింథీయులకు 1:15సుమారు క్రీ.శ. 59

    Lest any should say that I had baptized in mine own name.

  24. 1 కొరింథీయులకు 1:16సుమారు క్రీ.శ. 59

    అవును! స్తెఫెను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు.

  25. 1 కొరింథీయులకు 1:17సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.