కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 2:12సుమారు క్రీ.శ. 59

    దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.

  2. 1 కొరింథీయులకు 2:13సుమారు క్రీ.శ. 59

    మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము.

  3. 1 కొరింథీయులకు 2:14సుమారు క్రీ.శ. 59

    అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.

  4. 1 కొరింథీయులకు 2:15సుమారు క్రీ.శ. 59

    ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి వివేచిస్తారు కాని వారు ఎవరిచేత వివేచించబడరు.

  5. 1 కొరింథీయులకు 2:16సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు బోధింప గలవారెవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.

  6. 1 కొరింథీయులకు 3:1సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు.

  7. 1 కొరింథీయులకు 3:2సుమారు క్రీ.శ. 59

    మీరు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను మీకు పాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు దానికి సిద్ధంగా లేరు.

  8. 1 కొరింథీయులకు 3:3సుమారు క్రీ.శ. 59

    మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడం లేదా?

  9. 1 కొరింథీయులకు 3:4సుమారు క్రీ.శ. 59

    మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?

  10. 1 కొరింథీయులకు 3:5సుమారు క్రీ.శ. 59

    అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు.

  11. 1 కొరింథీయులకు 3:6సుమారు క్రీ.శ. 59

    నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే.

  12. 1 కొరింథీయులకు 3:7సుమారు క్రీ.శ. 59

    కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.

  13. 1 కొరింథీయులకు 3:8సుమారు క్రీ.శ. 59

    నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

  14. 1 కొరింథీయులకు 3:9సుమారు క్రీ.శ. 59

    కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.

  15. 1 కొరింథీయులకు 3:10సుమారు క్రీ.శ. 59

    దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి.

  16. 1 కొరింథీయులకు 3:11సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే.

  17. 1 కొరింథీయులకు 3:12సుమారు క్రీ.శ. 59

    ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,

  18. 1 కొరింథీయులకు 3:13సుమారు క్రీ.శ. 59

    ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది.

  19. 1 కొరింథీయులకు 3:14సుమారు క్రీ.శ. 59

    పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు.

  20. 1 కొరింథీయులకు 3:15సుమారు క్రీ.శ. 59

    అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకున్నట్లుగా ఉంటారు.

  21. 1 కొరింథీయులకు 3:16సుమారు క్రీ.శ. 59

    మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?

  22. 1 కొరింథీయులకు 3:17సుమారు క్రీ.శ. 59

    ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.

  23. 1 కొరింథీయులకు 3:18సుమారు క్రీ.శ. 59

    మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి.

  24. 1 కొరింథీయులకు 3:19సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాల్లో: “జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు” అని వ్రాయబడి ఉంది.

  25. 1 కొరింథీయులకు 3:20సుమారు క్రీ.శ. 59

    లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.