కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 5:2సుమారు క్రీ.శ. 59

    ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా!

  2. 1 కొరింథీయులకు 5:3సుమారు క్రీ.శ. 59

    నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కాబట్టి మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేశాను.

  3. 1 కొరింథీయులకు 5:4సుమారు క్రీ.శ. 59

    ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీతో ఉన్నాను.

  4. 1 కొరింథీయులకు 5:5సుమారు క్రీ.శ. 59

    కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

  5. 1 కొరింథీయులకు 5:6సుమారు క్రీ.శ. 59

    మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తం పిండిని పులియజేస్తుందని మీకు తెలుసు కదా!

  6. 1 కొరింథీయులకు 5:7సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కోసం వధించబడి ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి.

  7. 1 కొరింథీయులకు 5:8సుమారు క్రీ.శ. 59

    కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాము.

  8. 1 కొరింథీయులకు 5:9సుమారు క్రీ.శ. 59

    లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను.

  9. 1 కొరింథీయులకు 5:10సుమారు క్రీ.శ. 59

    అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా!

  10. 1 కొరింథీయులకు 5:11సుమారు క్రీ.శ. 59

    ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.

  11. 1 కొరింథీయులకు 5:12సుమారు క్రీ.శ. 59

    సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా?

  12. 1 కొరింథీయులకు 5:13సుమారు క్రీ.శ. 59

    సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”

  13. 1 కొరింథీయులకు 6:1సుమారు క్రీ.శ. 59

    మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు దానిని పరిశుద్ధుల ముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కోసం దాన్ని తీసుకెళ్తారా?

  14. 1 కొరింథీయులకు 6:2సుమారు క్రీ.శ. 59

    పరిశుద్ధులే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే చిన్న చిన్న తగాదాలను మీరు పరిష్కరించుకోలేరా?

  15. 1 కొరింథీయులకు 6:3సుమారు క్రీ.శ. 59

    మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు కదా!

  16. 1 కొరింథీయులకు 6:4సుమారు క్రీ.శ. 59

    కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా?

  17. 1 కొరింథీయులకు 6:5సుమారు క్రీ.శ. 59

    మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా?

  18. 1 కొరింథీయులకు 6:6సుమారు క్రీ.శ. 59

    అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్థానానికి తీసుకెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!

  19. 1 కొరింథీయులకు 6:7సుమారు క్రీ.శ. 59

    నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?

  20. 1 కొరింథీయులకు 6:8సుమారు క్రీ.శ. 59

    అయితే మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు.

  21. 1 కొరింథీయులకు 6:9సుమారు క్రీ.శ. 59

    తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,

  22. 1 కొరింథీయులకు 6:10సుమారు క్రీ.శ. 59

    దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

  23. 1 కొరింథీయులకు 6:11సుమారు క్రీ.శ. 59

    మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.

  24. 1 కొరింథీయులకు 6:12సుమారు క్రీ.శ. 59

    “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు” కాని, నేను దేనికి లొంగిపోను.

  25. 1 కొరింథీయులకు 6:13సుమారు క్రీ.శ. 59

    “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.